Search This Blog

మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? (The Purpose of Creation)

          మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? 


మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? అనే చిక్కు ప్రశ్న ప్రతి మానవుడికీ తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదురవుతుంది. ఏదో ఒక సందర్బంలో ప్రతి మానవుడు  “నేనెందుకు జీవిస్తున్నాను?“, “దేనికోసం నేను ఈ భూమిపై ఉన్నాను?“, “నా జీవితలక్ష్యం ఏమిటి?” అని తనను తాను ప్రశ్నించుకోవటం కూడా జరుగుతుంది. కానీ సమాధానం కనుక్కోవటానికి మనం ఎప్పుడైనా ప్రయత్నించామా? నిజాయితీగా చూస్తే, ఆ ఆలోచనే ఇంత వరకు రానివాళ్ళు అధికంగా ఉన్నారు.
మానవజాతి సృష్టి యెక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలుపుతున్నాడు:
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి  మాత్రమే“. (ఖురాన్ 51:56)
మానవులను, జిన్నులను పుట్టించటం లోని తన ఉద్దేశం ఏమిటో అల్లాహ్ పై వాక్యం లో తెలియపరిచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులను గానీ, జిన్నాతులను గానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరించలేదు. ఒకవేళ అదే కనక అయి ఉంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ధైవారాధనకు కట్టుబడి ఉండేవారు. కానీ అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుక లోని పరమార్ధాన్ని వారికి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్ధాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.
ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా అల్లాహ్ పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో. అదేమీ కాదు. ప్రపంచంలో అవిశ్వాసులు కల్పించే చిల్లరదేవుళ్ళ లాంటివాడు కాదు అల్లాహ్.
దీనిని గురుంచి అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు:
“నేను వారినుండి జీవనోపాధిని కోరడంలేదు. వారునాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు“.
“అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు“. (ఖురాన్51:57-58)
అల్లాహ్ కు మానవుల ఆరాధన యెక్క అవసరంలేదు. ఆయన తన అవసరాలను పూర్తిచేసుకోవటం కోసం మానవులను సృష్టించలేదు.  భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ ఆరాధన వల్ల అల్లాహ్ భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగానీ అల్లాహ్ కు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.ఒక్కమానవుడు కూడా ఆయనను ఆరాధించక పోయినా ఆయన యెక్క మహొన్నత స్థానానికి ఎటువంటి హానీ కలగదు. అలాగే, ప్రతి ఒక్క మానవుడు ఆయనను ఆరాధించిన, ఆయన యెక్క మహొన్నత స్థానానికి ఎటువంటి లాభము చేకూరదు. ఆయన సంపూర్ణుడు. కేవలం ఆయన మాత్రమే ఎటువంటి అవసరాలు లేకుండా ఉనికిలో ఉన్నాడు. సృష్టించ బడిన వాటన్నింటికీ అవసరాలు ఉన్నాయి. కాబట్టి, మానవజాతికే  ఆయనను ఆరాధించే అవసరం ఉన్నది.
ఘోరాతి ఘోరమైన మహా పాపం:
పైన తెలుపబడిన సృష్టి యెక్క ఉద్దేశ్యం (అంటే అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట)తో విభేదించటమనేది మానవుడు చేయగల అత్యంత ఘోరమైన మహా పాపం. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను “అల్లాహ్ దృష్టిలో అత్యంత ఘోరమైన పాపం ఏది?” అని  అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ప్రశ్నించగా, వారిలా జవాబిచ్చినారు “అల్లాహ్ యే మీ సృష్టికర్త అయినప్పటికీ, ఆయనకు భాగస్వామ్యం కల్పించటం (షిర్క్ చేయటం)”.
సృష్టికర్తతో పాటు లేక సృష్టికర్తను వదిలి, ఇతరులను ఆరాధించటాన్ని అరబీ భాషలో షిర్క్ చేయటం అంటారు. కేవలం ఇది మాత్రమే ఎట్టి పరిస్థితిలోను, అస్సలు క్షమించబడని అత్యంత ఘోరమైన మహాపాపం. ఒకవేళ మానవుడు అటువంటి ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాప పడకుండా, క్షమాపణ కోరకుండా మరణించినట్లయితే, అల్లాహ్ వారి మిగిలిన పాపాలన్నింటినీ క్షమిస్తాడు గాని, షిర్క్ ను మాత్రం అస్సలు క్షమించడు. ఈ విషయమై అల్లాహ్ దివ్యఖురాన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు:
“నిశ్చయంగా, అల్లాహ్ తనకు  భాగస్వామి(సాటి)ని కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించాడు. మరియు అది తప్ప దేనినీ (ఏ పాపాన్ని) అయినా, ఆయన తానుకోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిన వాడే, వాస్తవానికి మహాపాపం చేసినవాడు!“(ఖురాన్ 4:48).
అల్లాహుతా’ఆలాకు  సాటి (భాగస్వాములను) కల్పించటం మహా దుర్మార్గం మరియు క్షమించరాని పాపం. కావున ఇది ఎంత మాత్రం క్షమించబడదు. ముష్రికులకు స్వర్గం నిషేధించబడినది. నిశ్చయంగా, బహుధైవారాధన (షిర్క్) గొప్ప దుర్మార్గం.

No comments:

Post a Comment