ఇస్లాంలో పరిశుభ్రత (Cleanliness in Islam)
ఇస్లాంలో పరిశుభ్రత – النظافة من الإسلام
حَدَّثَنَا مُحَمَّدُ بْنُ الْمُثَنَّى وَ مُحمَّدُ بْنُ بَشَّارٍ وَ إِبْرَاهِيمُ بْنُ دِينَارٍ جَمِيعاً عَنْ يَحْيَىٰ بْنِ حَمَّادٍ . قَالَ ابْنُ الْمُثَنَّى : حَدَّثَنِي يَحْيَىٰ بْنُ حَمَّادٍ . أَخْبَرَنَا شُعْبَةُ عَنْ أَبَانُ بْنِ تَغْلِبَ عَنْ فُضَيْلٍ الْفُقَيْمِيِّ عَنْ إِبْرَاهِيمَ النَّخَعِيِّ عَنْ عَلْقَمَةَ عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ ، عَنِ النَّبِيِّ قَالَ:” لاَ يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ. قَالَ رَجُلٌ: إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَناً، وَنَعْلُهُ حَسَنَةً. قَالَ: إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ.اَلْكِبْرُ: بَطَرُ الْحَقِّ وَغَمْطُ النَّاسِ“رواة صحيح مسلم
హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా వ ముహమ్మదుబ్ను బష్షారిన్ వ ఇబ్రాహీముబ్ను దీనారిన్ జమీఅన్ అన్ యహ్యాబ్ని హమ్మాదిన్, ఖాల ఇబ్ను అల్ ముథన్నా, హద్దథనీ యహ్యాబ్ను హమ్మాదిన్, అఖ్బరనా షొబతు అన్ అబానుబ్ని తగ్లిబ అన్ ఫుదైలిన్ అల్ ఫుఖైమియ్యీ అన్ ఇబ్రాహీమ అన్నఖఇయ్యి అన్ అల్ఖమత అన్ అబ్దిల్లాహిబ్ని “లా యద్ఖులు అల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బిహి మిథ్ఖాలుదర్రతిన్ మిన్ కిబ్రిన్” ఖాల రజులున్ “ఇన్న అర్రజుల యుహిబ్బు అయ్యకూన థౌబుహు హసనన్, వ నఅలుహుహసనతన్” ఖాల “ఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల, అల్ కిబ్రు, బతరుల్ హఖ్ఖి వ గమ్తున్నాసి ” రవాహ్ సహీ ముస్లిం.
మస్ఊదిన్, అనిన్నబియ్యి ఖాల
అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధకర్త ← ముహమ్మదుబ్ను అల్ ముథన్నా, ముహమ్మదుబ్ను బష్షారిన్ , ఇబ్రాహీముబ్ను దీనారిన్ (వీరందరు) ← యహ్యాబ్ని హమ్మాదిన్ ← ఇబ్ను అల్ ముథన్నా ← యహ్యాబ్ను హమ్మాదిన్ ← షొబతు ← అబానుబ్ని తగ్లిబ ← ఫుదైలిన్ ఫుఖైమియ్యి ← ఇబ్రాహీమ అన్నఖయియ్యి ← అలఖమత ← అబ్దిల్లాహిబ్ని మస్ఊదిన్ (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.
అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు “ఎవరిహృదయములో నైతే అణువంత అహంభావం (గర్వం) ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశించలేడు. అప్పుడు ఒకవ్యక్తి ఇలా ప్రశ్నించాడు”, (అప్పుడు అక్కడ ఉన్న) ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు “ మరి మానవుడు నిశ్చయంగామంచి దుస్తులు ధరించాలని, మరియు మంచి పాదరక్షలు (చెప్పులు,బూట్లు) తొడగాలని ఇష్టపడతాడు కదా!” ప్రవక్త ఇలా స్పష్టం చేశారు, ఖచ్చితంగా అల్లాహ్ సౌందర్యవంతుడు మరియు సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంభావం (గర్వం) అంటే ఏమిటంటే వాస్తవాన్ని తిరస్కరించడము మరియు ప్రజలను నీచంగా (హీనంగా) భావించడము”. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.
హదీథ్ వివరణ
ఈ హదీథ్ పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది మరియు దురహంకారాన్ని, గర్వాన్ని నిరోధిస్తున్నది. హృదయంలో అణువంత అహంకారం (గర్వం) ఉన్నా సరే అతడు స్వర్గం లోనికి ప్రవేశించలేడు. ఒకవేళ అదే అహంకారం అతడిని అల్లాహ్ యొక్క ఉనికిని మరియు అల్లాహ్ యొక్క దివ్యవాణిని తిరస్కరించేటట్లు చేస్తే, అతడు తప్పక నరకాగ్నిలోనికి విసిరి వేయబడతాడు. దివ్యసందేశం గురించి అయిష్టం చూపటం, ఇంకా ఐశ్వర్యం, భౌతిక సౌందర్యం, సామాజిక మరియు ప్రాపంచిక ఔన్నత్యం మరియు పేరుప్రఖ్యాతులున్న వంశమని గర్వపడటం మొదలైనవి అతడిలో గర్వాన్ని, దురహంకారాన్ని పెంచి, ఇతరులను తక్కువగా, నీచంగా చూడటం వైపుకు మళ్ళిస్తుంది. తర్వాత తర్వాత వీటి వలన దివ్యసందేశాన్ని కూడా తిరస్కరించటం మొదలు పెడతాడు. మొదట అతడు నరకశిక్ష అనుభవిస్తాడు, అతడు ముస్లిం అవటం వలన ఆ తర్వాత స్వర్గంలోనికి చేర్చబడతాడు. ఏదేమైనా గాని చక్కని మంచి దుస్తులు అహంకారానికి, గర్వానికి చిహ్నం కాజాలదు. ఇంకా ఇస్లాం పరిశుభ్రంగా, హుందాగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ హదీథ్ ఉల్లేఖకుని పరిచయం: అబు అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవసందేశాన్ని ప్రాంరంభంలోనే స్వీకరించిన ప్రముఖులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి ఖుర్ఆన్ లోని 70 అధ్యాయములు (సూరహ్ లు) కంఠస్థం చేసినారు. 32వ హిజ్రీ సంవత్సరంలో దాదాపు 70 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో చనిపోయారు.
ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):
- అహంకారం మరియు ప్రజలను నిర్లక్ష్యం చెయ్యటం నిషేధించబడినది.
- పరిశుభ్రత అంటే ప్రతి దానికీ సంబంధించనది – ధరించే దుస్తులు, వాడే ఇతర వస్తువులతో సహా.
- ఇంటిని, పాఠశాలను, వీధులను పరిశుభ్రంగా ఉంచటం పై జాగ్రత్త వహించవలెను.
- వారానికి కనీసం ఒక్కసారైనా స్నానం చేయటం మెచ్చుకో దగిన విషయం.
No comments:
Post a Comment