Search This Blog

షిర్క్ (బహు దైవారాధన లేదా విగ్రహారాధన) ఎలా ప్రారంభమైనది ? (How shirk started?)

                   షిర్క్ ఎలా ప్రారంభమైనది ?


షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించుట) గురించి తెలుసుకున్న తర్వాత, అది ఈ లోకంలో ఎలా ప్రారంభమైనదో తెలుసుకోవటం మంచిది. షిర్క్ మొట్టమొదట నూహ్ అలైహిస్సలాం కు పూర్వపుకాలంలో ప్రారంభం అయినది. అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం ను వారి సంతతి వద్దకు ప్రవక్తగా చేసి పంపినప్పుడు ఆయన వారిని విగ్రహారాధనను విడనాడవలసినదిగా ఉద్బోదించారు, సకలరాశి సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాహ్ యొక్క ఆరాధన వైపునకు పిలిచారు. దానితో వారు ఆయనను వ్యతిరేకించారు, విగ్రహారాధనకు కట్టుబడి ఉంటానికి పూనుకున్నారు, ఆయనను ఉపదేశాలను తిరస్కరించారు, ఆయనను కష్టపెట్టడం ప్రారంభించారు. ఇంకా వారు ఇలా ప్రకటించారు.

నూహ్ 71:23:- “ మరియు వాళ్ళు అన్నారు – ఎట్టి పరిస్థితిలోను మన దేవుళ్ళను (విగ్రహారాధన ను) వదలవద్దు. మరియు వద్ మరియు సువాఅ మరియు యగూస్ మరియు యఊఖ్ మరియు నసరా ని వదలవద్దు అన్నారు.”

పై వాక్యం యొక్క వివరణ (సహీ బుఖారీ) లో అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఉల్లేఖన లో ఇలా వివరించబడినది – ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలాం కాలంనాటి ప్రజలలోని పుణ్యపురుషుల పేర్లు. వీరు చనిపోయిన తర్వాత షైతాన్ ఇట్లా ఉసి కొల్పెను.” మీరు మీ సభలలో ఆ పుణ్యపురుషుల ఫొటోలు, విగ్రహములు చేసి ఉంచి వారి గురించి తెలియజేస్తుండండి” వారు అదే విధముగా చేయటం ప్రారంభించారు.  కాని ఆ ప్రజలు వారిని ఆరాధించలేదు. తర్వాత ఈ విధంగా విగ్రహాలు తయారు చేసి వారు చనిపోయారు. వారి తర్వాత వచ్చిన ప్రజలు ఆ విగ్రహాలను ఆరాధించటం (పూజించడం) ప్రారంభించారు.

హాఫిజ్ ఇబ్నె అల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా విశదీకరించారు – “చాలామంది మతగురువులు ఇలా తెలిపారు. ఆ పుణ్యపురుషులు చనిపోయినప్పుడు ప్రజలు వారి సమాధుల వద్ద గుమిగూడి తపస్సులు(ధ్యానం) చేసెడివారు. ఆ తర్వాత వారి ఫొటోలు(చిత్రపటాలు), విగ్రహాలు తయారు చేశారు. ఇంకా కాలం మారే కొద్దీ, వారి తరువాత ప్రజలు వాటిని పూజించటం ప్రారంభించారు.” కాబట్టి దీని వలన అర్థం మవుతున్నది ఏమిటంటే షిర్క్ (బహు దైవారాధన లేదా అల్లాహ్ కు సాటి కల్పించుట) ప్రారంభమగుటకు అసలు కారణం పుణ్యపురుషుల విషయంలో గులూ (హద్దు మీరటం) చేయటమే. పుణ్యపురుషుల విషయంలో హద్దు మీరి విధేయత చూపటం వలన ప్రజలలో షిర్క్ చోటు చేసుకుంటుంది.

Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం

Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం


1. అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం – الشرك

నిర్వచనం:
అల్లాహ్ యొక్క దైవత్వం (తౌహీద్ రుబూబియత్) లో మరియు అల్లాహ్ యొక్క ఏకత్వపు ఆరాధనల (తౌహీద్ ఉలూహియత్) లో ఇంకెవరినైనా చేర్చటం, అంటే ఇతరులను అల్లాహ్ యొక్క భాగస్వాములుగా చేయటం. తౌహీద్ ఉలూహియత్ (అంటే దైవారాధనలలో అల్లాహ్ యొక్క ఏకత్వానికి వ్యతిరేకంగా, ఇతరులను భాగస్వాములుగా చేర్చటం – ఇంకో మాటలో బహుదైవారాధన చేయటం)లో బహుదైవారాధన ఎక్కువగా జరుగుతుంది. అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా వేడుకోవటం, ప్రార్థించటం అనేది దీనిలోని ఒక విధానం. కేవలం అల్లాహ్ కే చెందిన ఏకదైవారాధనా పద్ధతులలో కొన్నింటిని ఇతరులకు ప్రత్యేకం చేయటం దీనిలోని మరొక విధానం. ఉదాహరణకు – బలి ఇవ్వటం, ప్రమాణం చేయటం, దిష్టి తీయటం, భయపడటం, ఆశించటం, భక్తి చూపటం (ప్రేమించటం) మొదలైనవి. క్రింద తెలుపబడిన కొన్ని ప్రత్యేక ఆధారాల మరియు మూలకారణాల వలన అష్షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో భాగస్వామ్యం కల్పించటం) అనేది,  పాపాలన్నింటిలోను అత్యంత ఘోరమైన పాపంగా గుర్తింప బడినది.
1-   పోలిక: షిర్క్ అనేది దివ్యగుణాలలో సృష్టికర్తను తన సృష్టితాలతో పోలిక కల్పిస్తున్నది. ఎవరైనా అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నట్లయితే, వారు అల్లాహ్ కు భాగస్వాములను చేర్చినట్లు అగును. ఇది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని). దివ్యఖుర్ఆన్ లోని లుఖ్మాన్ అధ్యాయం 13వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –
(لقمان 13) “إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ” – భావం యొక్క అనువాదం – {ఖచ్ఛితంగాఅష్షిర్క్ (బహుదైవారాధనఅనేదిఅత్యంత ఘోరమైన పాపిష్టి పని}. దౌర్జన్యం (పాపిష్టి పని) అంటే ఒకదానికి చెందిన స్థానంలో వేరేది ఉంచటం. అంటే దేనికైనా చెందిన స్థానంలో దానిని కాకుండా వేరే దానిని ఉంచటం. కాబట్టి ఎవరైనా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధనలలో ఇతరులను కూడా చేర్చటమనేది, వారు తమ ఆరాధనలను తప్పుడు స్థానం లో ఉంచటమన్న మాట. ఇంకో మాటలో – అనర్హులైన వాటికి తమ ఈ ఉన్నతమైన బాధ్యతను (ఆరాధనను) సమర్పించటం. కాబట్టి, కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ‘ఆరాధన’ అనే దివ్యమైన హక్కును, దాని స్థానం నుండి తప్పించి, వేరే స్థానంలో ఉంచటం అంటే అనర్హులైన, అయోగ్యులైన వేరే వాటికి సమర్పించటం అనేది అత్యంత ఘోరమైన మహాపాపంగా సృష్టకర్త ప్రకటించినాడు.
2-    క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం: ఎవరైతే ఈ ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష వేడుకోకుండా చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ (ఎట్టి పరిస్థితులలోను క్షమించనని) ప్రకటించెను. ఖుర్ఆన్ లోని అన్నీసా (స్త్రీలు) అనే అధ్యాయంలోని 48వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
(النساء 48) – “إِنَّ اللَّهَ لا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ”
భావం యొక్క అనువాదం – {తనకు భాగస్వాములను కల్పించటాన్ని (షిర్క్) అల్లాహ్ క్షమించడు; కాని ఇది (షిర్క్) కాక  ఇతర పాపలన్నింటినీ ఆయన క్షమించవచ్చును}
3-    స్వర్గం నిషేధించబడినది:  ఎవరైతే తన ఆరాధనలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తారో (బహుదైవారాధన) చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. మరియు వారిని అల్లాహ్ శాశ్వతంగా నరకంలోనే ఉంచును. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి) అనే అధ్యాయంలోని 72వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –
”إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ “ (المائدة 72)
భావం యొక్క అనువాదం– {తనతో పాటు ఇతరులను ఆరాధిస్తున్న వారి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు నరకంలోనే వారు శాశ్వతంగా ఉండబోతున్నారు. అటువంటి పాపిష్టులకు సహాయపడే వారెవ్వరూ ఉండరు}.
4-   పుణ్యకార్యాలన్నీ వ్యర్థమవుతాయి: షిర్క్ (బహుదైవారాధన) కారణంగా చేసిన పుణ్యకార్యాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి, వ్యర్థమవుతాయి, ఉపయోగపడకుండా పోతాయి. దివ్యఖుర్ఆన్ లోని అల్ అన్ ఆమ్ అధ్యాయంలోని 88వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
” ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ- “ (الأنعام 88)
భావం యొక్క అనువాదం – {ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం: ఎవరి ఆరాధనలైతే తనను మెప్పిస్తాయో, వారికి అల్లాహ్ దీనిని ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు గనుక ఇతరులను అల్లాహ్ ఏకదైవత్వంలో భాగస్వాములుగా చేర్చితే, వారి చేసిన (కూడగట్టిన) పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి}.
ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అజ్జుమర్ అధ్యాయంలోని 70వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
(الزمر70) –  “وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنْ الْخَاسِرِينَ”
భావం యొక్క అర్థం – {కాని, ఏవిధంగా నైతే పూర్వికుల ముందు అవతరించినదో, అదే విధంగా మీ దగ్గర కూడా ఇది అవతరింపబడి ఉన్నది. ఒకవేళ మీరు ఎవరినైనా (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో) చేర్చితే, నిశ్చయంగా మీ యొక్క (జీవితపు) ఆచరణలు నిష్ప్రయోజనమైపోతాయి మరియు మీరు తప్పక (అధ్యాత్మికంగా) నష్టపోయిన వారి పంక్తులలో చేర్చబడతారు}
5-  ప్రాణ సంపదలకు రక్షణ ఉండదు: ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతారో, వారి యొక్క రక్తం (జీవితం) మరియు సంపద నిషిద్ధం కాదు. దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయం లోని 5వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.
(التوبة 5)-  “فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ”
భావం యొక్క అనువాదం – {యుద్ధరంగంలో మీకు ఎదురైన ప్రతి బహుదైవారాధకుడితో (ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త యొక్క దైవత్వంలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్న వారితో) యుద్ధం చేయండి మరియు వారిని హతమార్చండి మరియు వారిని బంధించండి మరియు చుట్టుముట్టండి మరియు వారి ప్రతి యుద్ధతంత్రంలో, యుక్తిలో ఘోరవైఫల్యం నిరీక్షిస్తున్నది.}
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు
“أمرت أن أقاتل الناس حتى يقولوا لا إله إلا الله و يُقيموا الصلاة و يُؤتوا الزكاة” –
అనువాదం – “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ (కేవలం ఒక్క అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు) మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ (ముహమ్మద్ ^ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానం (జకాత్) ఇచ్చే వరకు ప్రజలతో పోరు జరపమని (అల్లాహ్ నుండి) నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి వారు పైవిధంగా ఆచరిస్తే, వారి రక్తం మరియు సంపదకు ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాల సందర్భంలో తప్ప,  నా తరపున గ్యారంటీగా రక్షణ లభిస్తుంది.
6-      ఘోరాతి ఘోరమైన మహాపాపం: షిర్క్ (బహుదైవారాధన, అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వంలో ఇతరులను చేర్చటం) అనేది మహా పాపములలో ఘోరాతి ఘోరమైనది.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సంబోధించారు –  “ألا أنبئكم بأكبر الكبائر” – అనువాదం – “ఘోరాతి ఘోరమైన మహాపాపం గురించి మీకు తెలియజేయ మంటారా?” మేము (సహచరులం) ఇలా సమాధానమిచ్చాం, “అవును,  ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా r”, వారు ఇలా పలికారు, “الإشراك بالله وعقوق الوالدين” – అనువాదం – “అల్లాహ్ తో ఇతరులెవరినైనా జతపర్చటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం 
కాబట్టి షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరాతి ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని) మరియు తౌహీద్ (ఏకదైవత్వం) అత్యంత స్వచ్ఛమైనది, న్యాయమైనది. మరియు ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఏకదైవత్వాన్ని ఖండిస్తున్నట్లయితే, తిరస్కరిస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, వ్యతిరేకిస్తున్నట్లయితే అది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (అన్యాయం) అవుతుంది. ఇంకా తన ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చే వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. వారి జీవితం, సంపద, భార్య మొదలైనవి కేవలం తననే ఆరాధిస్తున్న ఏకదైవారాధకుల రక్షణ పరిధి లోనికి రావని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఇంకా తర్వాతి వారు మొదటి వారిని వారి బహుదైవారాధన కారణంగా ఖైదీ (దాసులుగా) చేయటానికి అనుమతి ఇవ్వబడుతున్నది. ఇంకా బహుదైవారాధకుల ఏ చిన్న మంచి పనినైనా సరే ఆమోదించటాన్ని లేదా ఎవరిదైనా సిఫారసు స్వీకరించటాన్ని లేదా పునరుత్థాన దినమున వారి పిలుపును అందుకోవటాన్ని అల్లాహ్ తిరస్కరించెను. ఎందుకంటే కేవలం అజ్ఞానం వలన, అల్లాహ్ కు భాగస్వామ్యం జతపర్చిన బహుదైవారాధకుడు అందరి కంటే ఎక్కువగా అవివేకుడు, మూఢుడు. అ విధంగా అతడు అల్లాహ్ పై దౌర్జన్యం (అన్యాయం) చెయ్యటమే కాకుండా స్వయంగా తనకు వ్యతిరేకంగా తానే దౌర్జన్యం (అన్యాయం) చేసుకుంటున్నాడు.
7-   ఒక లోపం మరియు తప్పిదం: షిర్క్ (బహుదైవారాధన)  అనేది ఒక లోటు, ఒక లోపం, ఒక దోషం, ఒక కళంకం, ఒక లొలుగు మరియు ఒక తప్పిదం – అల్లాహ్ యొక్క అత్యుత్తమమైన స్వభావం దీని (షిర్క్ భావనల) కంటే ఎంతో మహాన్నతమైనది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్నారో, అలాంటి వారు కేవలం అల్లాహ్ కే చెందిన ప్రత్యేక ‘మహోన్నత స్థానాన్ని’ తాము ఖండిస్తున్నామని మరియు వ్యతిరేకిస్తున్నామని స్వయంగా అంగీకరిస్తున్నట్లవు తున్నది.

షిర్క్ (బహుదైవారాధన) లోని భాగాలు:

షిర్క్ (బహుదైవారాధన) రెండు విభాగాలుగా విభజింపబడినది.

మొదటి విభాగం: అష్షిర్క్ అల్ అక్బర్ (ఘోరమైన భాగస్వామ్యం) – ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేస్తుంది మరియు ఒకవేళ పశ్చాత్తాప పడి, క్షమాభిక్ష అర్థించకుండానే చనిపోయినట్లయితే, వారిని నరకాగ్నిలో శాశ్వతంగా శిక్షింపబడుతూ ఉండేటట్లు చేస్తుంది. దైవశక్తులనే మూఢనమ్మకంతో ఇతరులను దర్శించి, వాటికి బలి సమర్పించుకుని తద్వారా తమ కోరికలు పూర్తిచేయమని, కష్టాలు తీర్చమని వేడుకోవటం, సమాధులకు, జిన్నాతులకు, దుష్టశక్తులకు మొక్కు బడులు చెల్లించడం వంటి తెలిసిన ఏ ఆరాధననైనా సర్వలోక సృష్టికర్త, సర్వశక్తిసమర్ధుడు అయిన అల్లాహ్ కు కాకుండా వేరే ఇతర వాటికి సమర్పించటం లేదా అల్లాహ్ తో పాటు వేరే ఇతర వాటికి కూడా సమర్పించటం. ఇంకా తమకు హాని చేయవద్దని చనిపోయిన వారిని, జిన్నాతులను, దుష్టశక్తులను, దయ్యాలను వేడుకోవటం మరియు కేవలం అల్లాహ్ మాత్రమే ప్రసాదించగలిగే శుభాలను అవి కూడా కలిగించ గలవని ఆశించి వాటిపై నమ్మకం పెట్టుకోవటం. దౌర్భాగ్యం కారణంగా ఈ రోజుల్లో దివ్యపురుషుల మరియు పుణ్యపురుషుల సమాధులపై గోపురాలు కట్టడం పెరిగి పోతున్నది. ఖుర్ఆన్ లో యూనుస్ అధ్యాయంలోని 18వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు –

سورة يونس : 18 “وَيَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لا يَضُرُّهُمْ وَلا يَنْفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلاءِ شُفَعَاؤُنَا عِنْدَ اللَّهِ”
భావం యొక్క అనువాదం – {అల్లాహ్ తో పాటు వారు ఎటువంటి హాని కలిగించలేని మరియు ఎటువంటి శుభాలు కలిగించలేని ఇతరులను ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా పలుకుతున్నారు: “ఇవి మా గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాయి}

రెండవ విభాగం: అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన), ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేయదు, కాని నిశ్చయంగా ఏకైక దైవారాధనకు తప్పక నశింప జేస్తుంది  మరియు ఇది తప్పక ఘోరమైన భాగస్వామ్యానికి (అష్షిర్క్ అల్ అక్బర్) చేర వేస్తుంది. ఇది రెండు రకాలుగా విభజింపబడినది:

మొదటి రకం: شرك ظاهر బయటికి కనబడే షిర్క్, మరియు ఇది మాటల ద్వారా మరియు చేతల ద్వారా జరుగుతుంది.
మాటలలో బయటికి కనబడే షిర్క్ అంటే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయటం ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు “من حلف بغير الله”- అనువాదం – “ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరుల పై ప్రమాణం చేస్తారో, వారు అవిశ్వాసపు పని (లేదా అల్లాహ్ యొక్క ఏకత్వంలో భాగస్వామ్యాన్ని చేర్చిన పని) చేసిన దోషిగా శిక్షకు అర్హులవుతారు.” మరొకసారి ఒక సహచరుడు – అల్లాహ్ మరియు మీరు ఏది తలిస్తే (అది జరుగుతుంది) అని వారితో పలికినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఇలా స్పందించారు, “أجعلتني لله نداّ” – అనువాదం – “నన్ను అల్లాహ్ కు సాటిగా చేస్తున్నారా? (అలా పలకే బదులు) కాని ‘కేవలం అల్లాహ్ ఏదైతే తలుస్తాడో (అది జరుగుతుంది)’ అని పలక వలెను.” అలాగే ‘అల్లాహ్ కోసం మరియు ఫలానా ఫలానా వారికోసం’ అని పలికే బదులు, ఎవరైనా ఇలా పలకవలెను ‘‘ఏదైతే అల్లాహ్ తలుస్తాడో, ఆ తర్వాత ఫలానా ఫలానా వారు తలుస్తారో’ అని పలక వలెను. ఎందుకంటే ‘అల్లాహ్ తర్వాత ఫలానా ఫలానా’ అని పలకటంలో ‘తర్వాత’ అనే వదం పరంపర క్రమాన్ని తగ్గిస్తున్నది. కాబట్టి, దాసుడి ఇష్టాని కంటే ముందు అల్లాహ్ యొక్క ఇష్టం వస్తున్నది. దివ్యఖుర్ఆన్ లోని అత్తక్వీర్ అధ్యాయంలోని 29వ వచనంలో అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు  “وَمَا تَشَاءُونَ إِلا أَنْ يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ” (التكوير 29) – భావం యొక్క అనువాదం – {కాని మీరు ఇష్టపడలేరు, కాని సర్వలోకాల పరిపాలకుడైన ఒక్క అల్లాహ్ తప్ప}. ఇక ‘మరియు’ అనే పదం, తెలిపిన వైఖరి ప్రకారం ఇది జతపర్చటాన్ని మరియు పంచుకోవటాన్ని సూచిస్తుంది. ఉదాహరణగా “ నాకు సహాయపడే వారిలో అల్లాహ్ మరియు మీరు” అనేది మరియు “ఇది అల్లాహ్ యొక్క మరియు మీ యొక్క దీవెనల వలన” .
చేతలలో బయటికి కనబడే షిర్క్ – అంటే ఆపదలను, కష్టాలను తొలగిస్తుందని మరియు వాటి నుండి రక్షిస్తుందని, రింగు తొడగటం లేదా త్రాడు లేక దారం కట్టుకోవటం. ఏదేమైనప్పటికీ, ఈర్ష్యాసూయాల నుండి, దిష్టి తగలటం నుండి కాపాడుకోవటం కోసం రక్షాబంధనలు, తాయెత్తులు, తావీజుల వంటివి కట్టుకోవలెనని అల్లాహ్ యొక్క ఇస్లామీయ ధర్మ శాస్త్రం (షరియత్) లో ఎక్కడా ప్రకటింప బడలేదు. కాబట్టి ఎవరైనా ఇటువంటి మంత్రతంత్రములను సహాయపడతాయని విశ్వసిస్తూ, వాటిని ఉపయోగిస్తున్నట్లయితే షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన భాగస్వామ్యం) చేస్తున్న వారవుతారు. కాని ఒకవేళ ఎవరైనా ఆ తాయెత్తుల వంటివి స్వయంగా తమకు లాభం చేకూర్చుతాయని నమ్మితే, వారు షిర్క్ అల్ అక్బర్ (ఘోరమైన మహాపాపం) చేస్తున్న వారవుతారు. ఎందుకంటే వారు అల్లాహ్ పై కాకుండా ఇతర వాటిపై ఆధారపడుతున్నారు.
రెండవ రకం: شرك خفي బయటికి కనబడని, రహస్యమైన షిర్క్ మరియు ఇది తలంపుల, సంకల్పం, కోరికల, ఇష్టాయిష్టాల ద్వారా ఇతరులకు చూపాలనే ఉద్ధేశంతో జరుగుతుంది. ఎవరికైనా చూపించాలనే సంకల్పంతో, వారు తనను పొగడాలనే కోరికతో ప్రార్థనలు చేయటం. ఉదాహరణకు ప్రజలు తనను పొగడాలనే ఉద్ధేశంతో ప్రార్థనలు చేస్తూ, ఇతరులకు దానధర్మాలు చేయటం, ఇంకా తన కంఠస్వరాన్ని ప్రజలు పొగడాలని మంచి ఖిరాత్ తో ఖుర్ఆన్ పారాయణం చేయటం. ఈ సంకల్పం తప్పక వారి ఆరాధనలను నిర్వీర్యం చేస్తుంది. దివ్యఖుర్ఆన్ లోని అల్ కహాఫ్ అనే అధ్యాయంలోని 110వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు.
(الكهف 110) – “فَمَنْ كَانَ يَرْجُوا لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلا صَالِحًا وَلا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا”
భావం యొక్క అనువాదం – {తన ప్రభువు ను కలవబోతున్నామని ఎవరైతే భావిస్తున్నారో, వారు పుణ్యకార్యాలు చేయవలెను మరియు అల్లాహ్ కు భాగస్వామిగా ఎవరినీ అంగీకరించకూడదు}.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు,
“ أخوف ما أخاف عليكم الشرك الأصغر ”
“నేను మీ గురించి ఎక్కువగా భయపడేది ఏమిటంటే అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన)” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించారు. ‘అష్షిర్క్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) అంటే ఏమిటి, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా r?’, వారిలా జవాబిచ్చారు -“అర్రియా الرياء (show off పనులు)”. ఉదాహరణకు ప్రపంచంలో కొన్ని లాభాలు పొందటానకి ప్రార్థనలు చేయటం. అలాంటి సంకల్పంలో కొందరు వ్యక్తులు హజ్ యాత్ర చేస్తారు, అజాన్ (నమాజు కోసం పిలిచే పిలుపు) ఇస్తారు, నమాజులో ప్రజలకు నాయకత్వం వహించి, బదులుగా పైసలు తీసుకుంటారు, ఇస్లామీయ ధర్మ విద్యను అభ్యసిస్తారు, ఇంకా ధనం కోసం ధర్మయుద్ధం (జిహాద్) లో పాల్గొంటారు. వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు “تعس عبد الدينار” – అనువాదం – “దీనార్ దాసుడు, దిర్హమ్ దాసుడు, ఖమీలా (మందమైన మెత్తని ఉన్నతమైన వస్త్రం) దాసుడు మరియు ఖమీసా (మంచి దుస్తుల) దాసుడు నశించిపోవుగాక, ఎందుకంటే వాటితో అతడు సంతృప్తి పడినాడు అవి దొరకకపోతే అతడు సంతోషం చెందడు (అసంతృప్తి చెందతాడు)”
ఇబ్నె ఖయ్యుం అనే ప్రముఖ ఇస్లామీయ పండితుడు ఇలా తెలిపెను, ‘సంకల్పంలో మరియు భావాలలో బహుదైవారాధన అంటే ‘అది తీరాలు లేని ఒక సముద్రం లాంటిది, చాలా తక్కువ మంది అందులో నుండి బతికి బయట పడినారు’. కాబట్టి, ఎవరైనా సరే, ఏదైనా పనిని అల్లాహ్ ను కాకుండా వేరే ఇతరులను సంతృప్తి పరచటానికి చేసినా మరియు అల్లాహ్ వైపుకు  కాకుండా వేరే ఇతరుల దరి చేరి, వేడుకున్నా, వారు తమ సంక్పంలో మరియు ఆలోచనలలో షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకత్వంలో భాగస్వామ్యం కల్పించటం) చేసిన వారవుతారు.   దానికి విరుద్ధంగా, దైవ విశ్వాసం అంటే తమ మాటలలో, చేతలలో మరియు సంకల్పంలో, భావాలలో అల్లాహ్ కు విశ్వసనీయుడిగా జీవించటం అన్నమాట. ఇదియే తన దాసుల నందరినీ ఆచరించమని అల్లాహ్ ఆదేశించిన ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క హనీఫా ధర్మం (బహుదైవారాధన నుండి ఏక దైవరాధన వైపునకు మరలటం). ఈ ధర్మం కాకుండా వేరే ఇతర ఏ ధర్మాన్నీ అల్లాహ్ తీర్పుదినం నాడు స్వీకరించడు. హనీఫా ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా తిరిగి బోధించటమే ఇస్లాం ధర్మంలోని సుగుణం.   దివ్యఖుర్ఆన్ లోని ఆలె ఇమ్రాన్ అధ్యాయంలోని 85వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
سورة آل عمران : 85 “وَمَنْ يَبْتَغِ غَيْرَ الإسْلامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنْ الْخَاسِرِينَ” –
దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {ఎవరైనా ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ఇతర ధర్మాన్ని అనుసరించాలని కోరుకుంటే, అది ఎన్నటికీ స్వీకరించబడదు. మరియు పరలోకంలో వారు నష్టపోయిన వారి (పుణ్యాలన్నీ కోల్పోయిన వారి) శ్రేణులలో ఉంటారు}. వాస్తవానికి ఇదే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సురక్షిత విశ్వాసం, దీనిని తిరస్కరించిన వారందరూ అజ్ఞానంలో అట్టడుగు స్థాయికి చేరుకున్నవారే.”
అష్షిర్క్ అల్ అక్బర్ (అత్యంత ఘోరాతి ఘోరమైన బహుదైవారాధన) మరియు అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) ల మధ్య ఉన్న కొన్ని ప్రధాన విభేదాలను ఇక్కడ పున:పరిశీద్దాం:
1-   అష్షిర్క్ అల్ అక్బర్ ప్రజలను ఇస్లాం నుండి బహిష్కరింప జేస్తుంది. కాని అష్షిర్క్ అల్ అస్గర్ ప్రజలను ఇస్లాం నుండి బహిష్కరింప జేయదు.
2-     అష్షిర్క్ అల్ అక్బర్ ప్రజలను నరకాగ్నిలో శాశ్వత నివాసం ఏర్పరుస్తుంది. కాని అష్షిర్క్ అల్ అస్గర్ ప్రజలను నరకాగ్ని లో శాస్వత నివాసం ఏర్పరచదు. కొంతకాలం శిక్షను అనుభవించిన తర్వాత అలాంటి వారిని నరకాగ్నిలో నుండి బయటకు తీయటం జరుగును.
3-     అష్షిర్క్ అల్ అక్బర్ వలన చేసిన పుణ్యకార్యాలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ప్రపంచ జీవితంలో చేసిన మంచి పనులు, పుణ్యకార్యాలు పరలోకంలో నిష్ప్రయోజనమైపోతాయి.  అష్షిర్క్ అల్ అస్గర్ వలన అలా జరుగదు. అయితే లభించే పుణ్యాలు తగ్గుతాయి.

అష్షిర్క్ అల్ అక్బర్ వలన ప్రాణం మరియు సంపద సంరక్షణలో ఉండవు. కాని అష్షిర్క్ అల్ అస్గర్ వలన సంఱక్షణలో ఉంటాయి.

ఖుర్ఆన్ పరిచయం(What is quran)

 ఖుర్ఆన్ పరిచయం(What is Quran)



       బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
     అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో
మానవాళికి విశ్వప్రభువు లెక్కించలేనన్నిశుభాలను ప్రసాదించాడు. ఆయన మనిషి జీవితానికి అవసరమయ్యే అన్న పానీయాలను ఇవ్వటమే గాక, మనోభావాల్ని ప్రకటించే శక్తియుక్తులను కూడా ప్రసాదించాడు. జీవించే ఉపాయాలను ప్రసాదించాడు. ఇంకా మనిషి సంస్కృతీ నాగరికతలకు దోహదపడే సామగ్రిని భూమండలంలో పుష్కలంగా పొందుపరచాడు.
సృష్టికర్త ఇచ్చిన ఈ భౌతికానుగ్రహాలన్నీ ఒక ఎత్తయితే, అధ్యాత్మికంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించటం ఇంకో ఎత్తు. సర్వవిధాల మానవత్వం పై దయదలచిన సృష్టికర్త, మానవులకు సన్మార్గం చూపే ఏర్పాటు కూడా చేశాడు. దాని ద్వారా ప్రపంచంలో శాంతి స్థాపన, అల్లకల్లోల నిర్మాలన, మంచి, మానవత్వం, నీతి నియమాలతో కూడిన సమాజ నిర్మాణ ప్రయత్నాలు యుగయుగాలుగా జరుగుతున్నవి.  మానవ సమాజాల్లో అశాంతి, అరాచకం ప్రబలిపోవడాన్ని సృష్టికర్త ఎంతమాత్రం ఇష్టపడడు. వాస్తవమేమిటంటే తన దాసులయిన మానవులంటే ఆయనకు అమితమైన  ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించడంతో పాటు వారి ఇహపర సాఫల్యాల కోసం మార్గదర్శక ఏర్పాటు కూడా చేశాడు. తన ప్రవక్తల ద్వారా సమస్త మానవజాతికి మార్గ దర్శక నియమావళిని ప్రసాదించాడు. దైవ ప్రవక్తలందరికీ ఆయా కాలాలను, అవసరాలను బట్టి దివ్యగ్రంథాలను, ప్రవర్తనా నియమావళుల (సహీఫాల) ను ఇచ్చాడు. వాటి ఆధారంగా ప్రవక్తలు మానవ సంస్కరణా కార్యానికి పూనుకునేవారు. ప్రజల జీవితాలను తీర్చిదిద్దేవారు. దైవభీతి, పరలోక చింతన ప్రాతిపదికగా మానవసమాజాల్లో నైతిక విప్లవం తెచ్చేవారు.
ఈ మార్గదర్శక గ్రంథాలలో చిట్టచివరిదే దివ్యఖుర్ఆన్. దీనికి పూర్వం దివ్యగ్రంథాలెన్నో అవతరించాయి. ఉదాహరణకు తౌరాత్, జబూర్, ఇంజీల్ కూడా మానవాళి మార్గదర్శకత్వం కోసం సృష్టికర్త పంపిన దివ్యగ్రంథాలే. కాని ఆ పవిత్ర గ్రంథాల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం, ఆయా మతాధిపతులు, స్వప్రయోజనాల కోసం చేసిన మార్పుల వల్ల, అవి తమ స్వచ్ఛతను, ప్రామీణికతను, అసలు స్థితిని కోల్పోయి కలుషితమైపోయాయి. క్రమంగా దివ్యసందేశంలో మానవ కల్పితాలు చోటు చేసుకున్నాయి. సత్యమార్గాన్ని పెడత్రోవ పట్టించారు. మానవజాతి ఇలా అపమార్గానికి లోనైనప్పుడల్లా సృష్టికర్త మరో ప్రవక్తను, మరో జీవన విధానాన్ని పంపి, మరచిపోయిన దైవాజ్ఞలను తిరిగి జ్ఞాపకం చేసుకునేటట్లు ఏర్పాటు చేశాడు. ఆటువంటి దివ్యమైన మార్గదర్శక పరంపరలో చిట్టచివరి దైవగ్రంథమే, ఈ దివ్యఖుర్ఆన్.
దివ్యఖుర్ఆన్ మానవజాతి పట్ల ఓ గొప్ప అనుగ్రహం. ప్రపంచంలోని మరే అనుగ్రహమూ దీనితో సరితూగలేదు. మనిషి ఇహపర సాఫల్యాలు, సభ్యతా సంస్కారాలు, గౌరవోన్నతులు, నీతి నడవడికలు – అన్నీ ఈ దివ్యగ్రంథంలో ఇమిడి ఉన్నాయి. ఇది ఒక మహా సాగరం. దీనిని ఎంత శోధించినా తనివి తీరదు.  దీని లోతుల్లోకి పోయిన కొద్దీ విలువైన ముత్యాలు దొరుకుతూనే ఉంటాయి. క్రొత్త క్రొత్త విషయాలు ముందుకు వస్తూనే ఉంటాయి. దీని అధ్యయనం వలన హృదయం జ్యోతిర్మయమవుతుంది అంటే జ్ఞానకాంతితో నిండిపోతుంది.
విజ్ఞానం పేరుతో నేడు ఆకాశాలలో స్వైరవిహారం చేస్తున్న మనిషికి నేలపై నిలిచి సాటి మనిషులతో సహజీవనం చేయడం చేతకావడం లేదు. కమ్యూనికేషన్ల ప్రగతి వలన వివిధ దేశాల మధ్య దూరం తరిగిపోయి ప్రపంచం కుంచించుకు పోతున్నా, మనుషుల మనసులు మాత్రం ఒక్కటి కావటం లేదు. జాతి, రంగు పేరిట నేటికీ ప్రపంచంలో విద్వేషం పెరిగి రక్తం చిందుతూనే ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నేడు ప్రపంచమంతా రోగగ్రస్తమై ఉన్నది. దానికి చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖుర్ఆన్ ఒక దివ్య ఔషధం! అది సర్వరోగ నివారిణి! అది మానవులందరికీ మార్గదర్శిని! హృదయానికి హత్తుకుని, దానిని అనుసరించేవారికి అది మోక్షం పొందే మార్గాన్ని సూచిస్తుంది. మొత్తం మానవజాతి కోసం పంపబడిన అటువంటి దివ్యఔషధాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం?  మనకు తెలిసిన భాషలో అందుబాటులో ఉన్న దాని భావాన్ని కనీసం ఒక్కసారైనా చదవటానికి, అర్థం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించటం లేదు? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలనే సామెతను మరచిపోయారా? ఈ జీవితకాలంలో దానిని చదవక, మరణించగానే ఎదురయ్యే కఠినాతి కఠినమైన నరకశిక్ష అనుభవిస్తూ, పశ్చాత్తాపం పడటంలో ఏమైనా వివకమున్నదా? సృష్టికర్త ప్రసాదించిన అద్భుతమైన, అపూర్వమైన మన తెలివితేటలను ప్రపంచ మాయాజాలం నుండి కనీసం ఒక్కసారైనా తప్పించి, ఇహపరలోకాల సాఫల్యానికి దారి చూపించగలిగే ఏకైక, స్వచ్ఛమైన, సత్యమైన అంతిమ దివ్యగ్రంథాన్ని నేటి నుండే చదవటానికి దయచేసి ప్రయత్నించండి. మరణం ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు. లేదా హఠాత్తుగా మన పంచేంద్రియాలు పనిచేయటం మానివేయవచ్చు. లేదా కోలుకోలేని దీర్ఘకాల అనారోగ్యానికి గురికావచ్చు. ‘ఇన్నేళ్ళపాటు మనం సురక్షితంగా, క్షేమంగా జీవిస్తామని’ చెప్పగలిగే స్థితికి సైన్సు పరిజ్ఞానం ఏనాడూ చేరలేదు. ఆ జ్ఞానం కేవలం సర్వలోక సృష్టికర్త వద్దనే ఉన్నది. కాబట్టి మన తెలివితేటలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడే, మన పంచేంద్రియాలు సరైన స్థితిలో ఉన్నప్పుడే అంటే సరిగ్గా గ్రహిస్తున్నప్పుడే మరియు ఆరోగ్యంగా ఉన్న ఈ వయస్సులోనే ప్రతిరోజు దివ్యఖుర్ఆన్ లోని కొంతభాగాన్నైనా చదివి, అర్థం చేసుకోవటానకి ప్రయత్నించవలెను. ఈ ప్రయత్నంలోని నిజాయితీ పైనే సృష్టికర్త తోడ్పాడు ఆధారపడి ఉంటుందనేది మరచిపోవవద్దు. ఖుర్ఆన్ ద్వారా సరైన మార్గదర్శకత్వం పొందగలిగితే లాభపడేది మీరే. అలాగే ఖుర్ఆన్ ను నిర్లక్ష్యం చేసి, ఇహపరలోకాల సాఫల్యపు స్వచ్ఛమైన, సత్యమైన మార్గాన్ని తెలుసుకోలేకపోతే నష్టపోయేది కూడా మీరే. ఇది మరణించగానే ప్రతి ఒక్కరి ముందుకు రాబోయే ఒక నగ్నసత్యం. అన్ని మతాలు, ధర్మాలు మంచివైపుకే పిలుస్తున్నాయని, దైవాన్ని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చని, తాము అనుసరిస్తున్న అంధవిశ్వాసాల, ప్రాచీన గ్రంథాల ద్వారా కూడా ముక్తి పొందవచ్చని చాలా మంది అపోహలు పడుతున్నారు. కొంతకాలం ఆ భ్రమలను ప్రక్కన పెట్టి, అంతిమ దైవసందేశమైన దివ్య ఖుర్ఆన్ చదివితే కలిగే నష్టమేమిటి? వారు భ్రష్టపడిపోతారా? తమ మతం, ధర్మం నుండి వెలివేయబడతారా? ప్రతి ధర్మం సత్యాన్వేషణను ప్రోత్సహిస్తుందే తప్ప నిరుత్సాహపరచదు. కాబట్టి నిజాయితీగా చూసినట్లయితే, కేవలం మనలోని అహంభావం, నిర్లక్ష్యం, ప్రస్తుత జీవన విధానం పై హద్దుమీరిన విశ్వాసం, ఇతర ధర్మాలపై ముఖ్యంగా ఇస్లాం ధర్మం పై అపనమ్మకం మొదలైన కారణాల వలన మాత్రమే మన ముందున్న అత్యున్నతమైన అంతిమ దివ్యగ్రంథం పట్ల మనకు ఆసక్తి, కుతూహలం కలగటం లేదు.
“ఓ మనిషీ! ప్రతి వైద్యుడూ నీ రోగాన్ని మరింత తీవ్రతరమే చేశాడు. నువ్వు నా వైపుకు రా!  నీ రోగాన్ని నేను నయం చేస్తాను” అని పిలుస్తోంది ఖుర్ఆన్. కనుక మనం ఖుర్ఆన్ వైపుకు మరలాలి. దాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. మనకు అత్యవసరమైన మోక్షానికి, ఇహపర సాఫల్యాలకు ఈ గ్రంథమార్గదర్శకత్వం తప్పని సరి.

అయతుల్ కుర్సీ Ayat-al-Kursi

                 అయతుల్ కుర్సీ Ayat-al-Kursi


اللّهُ لاَ إِلَـهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لاَ تَأْخُذُهُ سِنَةٌ وَلاَ نَوْمٌ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاء وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلاَ يَؤُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ  యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము  మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా  య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం (ఖుర్ ఆన్ 2:255).

ఆయన  అల్లాః . ఆయన తప్ప దాస్యానికి అర్హుడు ఎవరూ లేరు . ఆయన హమేషా సజీవుడుగా వుంటాడు . అందరినీ  ఆదుకునే వాడు . ఆయనకు నిద్ర , కునుకూ రావు . భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే . ఆయన ఆజ్ఞ లేనిదే సిఫారసు  చేసేవారు ఎవరున్నారు ?  ప్రాణులకు ముందూ వెనుకలలో ఏమున్నదో ఆయన ఎరుగు. ఆయన కోరిన మేరకు తప్ప ఆయన జ్ఞానం నుండి వారు ఏమి గ్రహించలేరు . ఆయన పీటం భూమి ఆకాశాలను ఆవరించి వుంది . ఆ రెండింటి సంరక్షణ ఆయనకు అలుపు తెప్పించదు . ఆయన అందరికన్నా ఉన్నతుడు మరియు గొప్పవాడు .

ప్రవక్తలను, సందేశహరులను عليهم السلام అల్లాహ్ ఎందుకు పంపెను?(why prophets were sent)

                          ప్రవక్తలను అల్లాహ్ ఎందుకు పంపెను?(why prophets were sent)


ఎప్పుడైతే ప్రజలు సర్వలోక సృష్టికర్త యొక్క ఏకదైవారాధనను వదిలి, షిర్క్ (ఏకైక దైవారాధనలో ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం) అనే అంధవిశ్వాసాల్ని, సహేతుకం కాని సిద్ధాంతాల్ని కనుగొన్నారో, అప్పటి నుండి తన భక్తులను కేవలం తనను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించటానికి, ఆరాధనలలో ఇతరులను తనతో జత పరచ వద్దని ఆజ్ఞాపించటానికి మరియు వారిని బహుదైవారాధనపు గాఢాంధకారంలో నుండి ఏకైక దైవారాధనపు వెలుగు లోనికి తీసుకు రావటానికి అల్లాహ్ తన ప్రవక్తలను మరియు సందేశహరులను పంపటం మొదలు పెట్టినాడు. ప్రవక్తలందరూ తౌహీద్ (ఏకైక దైవత్వం అంటే మహోన్నతమైన మరియు అత్యంత ప్రశంసనీయమైన అల్లాహ్ యొక్క ఏకైకత్వంలో విశ్వాసం)నే బోధించారు. ఖుర్ఆన్ లోని క్రింది వచనాలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి:

వాస్తవంగా మేము నూహ్ ను అతని జాతి వద్దకు పంపాముఅతను వారితో ప్రజలారాఅల్లాహ్ నే ఆరాధించండిఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడువాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నానుఅని అన్నాడు(7:59)

మరియు మేము ఆద్ జాతి వద్దకువారి సోదరుడైన హూద్ ను పంపాముఅతను:ఓ నా జాతి సోదరులారా!మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండిఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడుఏమిటీ? మీకు దైవభీతి లేదా? (7:65) ఇది ఆద్ జాతి కు వచ్చిన ప్రవక్త సందేశం.

మరియు మేము మద్యన్ జాతి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము) అతను వారితో అన్నాడు: నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండిమీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడువాస్తవంగామీ వద్దకుమీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చియున్నదికొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తి నిజాయితీతో ఇవ్వండిప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండిభూమిపై శాంతి స్థాపించబడిన తర్వాత మరల కల్లోల్లాన్ని రేకెత్తించకండిమీరు విశ్వాసులే అయితేఇదే మీకు మేలైనది (7:85). ఇది మద్యన్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన ప్రకటన.{మద్యన్ అనేది ఒక తెగ & నగరపు పేరు. వారి వద్దకు షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్త గా  పంపబడ్డారు. మద్యన్ యొక్క  మరొక పేరు అయ్ కహ్. మృత సముద్రానికి తూర్పున, అఖాభా అగాధం నుండి (Gulf of Aqaba) పడమటి వైపు ఉన్న సినాయి ద్వీపకల్పం మరియు మోఆబ్ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నది. అక్కడ నివసించే వారు ఆమోరైట్ తెగకు చెందిన అరబ్బులు. షుఐబ్ మరో పేరు ఎత్రో (Jethro)}

ఇక సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాముఅతను వారితో:“నా జాతి ప్రజలారాఅల్లాహ్ నే ఆరాధించండిఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు(7:73) ఇది సమూద్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు రమ్మని ఆహ్వానించిన ప్రకటన.{సమూద్ ప్రజలు ఆద్ జాతికి చెందిన నబాతియన్ తెగకు చెందిన వారు. రెండవ ఆద్ జాతిగా ప్రసిద్ధి చెందినారు. వారు హిజాజ్ ఉత్తర భాగంలో ఉండేవారు. ఆ ప్రాంతం వాది అల్ ఖురా అనబడుతుంది. వారు ఆ పర్వత ప్రాంతంలో కొండలను తొలిచి గుహలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ సాలెహ్. నేటికీ అవి ఆ పేరుతోనే పిలవబడుతున్నాయి. ఇది మదీనా పట్టణం మరియు తబూక్ పట్టణాల మధ్య ఉన్నది. ఇప్పటికీ వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి.}

మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపాము.(అతడన్నాడు)మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండిమరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి (16:36)

అల్లాహ్ ప్రతి ప్రవక్తను ఆయన స్వంత జాతి వద్దకు  వారి మార్గదర్శకత్వం కోసం పంపెను. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మొత్తం మానవజాతి మరియు జిన్నాతుల మార్గదర్శతక్వం కోసం పంపెను. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లోని (7:158) వచనం ధృవీకరుస్తున్నది-(ఓ ముహమ్మద్!) ఇలా ప్రకటించు:మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను

మరియు నేను జిన్నాతులు మరియు మానవులను సృష్టించిందికేవలం వారు నన్ను ఆరాదించటానికే!(51:56)

ఇంకా ఖుర్ఆన్ లోని అనేక వచనాల మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల వలన స్పష్టమవుతున్న దేమిటంటే, మానవాళికి మార్గదర్శకత్వపు అవసరం కలిగినప్పుడు,  అల్లాహ్ ప్రవక్తలను పంపినాడు.

దివ్యఖుర్ఆన్ – అల్లాహ్ నుండి ఒక మహాద్భుత మహిమ (Noble Quran – A Miracle from Allah)

    దివ్యఖుర్ఆన్ – అల్లాహ్ నుండి ఒక మహాద్భుత                                      మహిమ 


దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను
(సర్వలోక సృష్టికర్తైన అల్లాహ్ , తన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన అంతిమ సందేశం) – ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధనల వెలుగులో………

[وَمَـا  كَانَ  هـٰــذَا  الْــقُــرْآَنُ   أَنْ  يُــفْــتَــرَى  مِـنْ دُوْنِ  اللهِ  وَلـٰـكِــنْ  تَــصْـدِيْـقَ  الَّذِي   بَــيْـنَ  يَــدَيْــهِ  وَتَــفْـصِـيْـلَ الْـكِـتـٰـبِ  لَا  رَيْــبَ فِــيْــهِ  مِـنْ  رَّبِّ  الْعـٰـلَـمِـيْـنَ] (3710:)
“మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ అవతరణ సంభవం కాదు: వాస్తవానికిది పూర్వగ్రంథాలలో మిగిలి ఉన్న దానిని సత్యాన్ని ధృవపరుస్తోంది: మరియు ఇది ముఖ్య సూచనలను వివరించే గ్రంథం: ఇది సమస్త లోకాల పోషకుడైన అల్లాహ్ తరుపు నుండి వచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు!” {ఖుర్ఆన్ 10వ అధ్యాయం ‘యూనుస్’ లోని 37వ ఆయత్ యొక్క భావపు అనువాదం}

[وَ مَـنْ  يَـبْـتَـغِ  غَـيْـرَ الْإِسْـلَامِ  دِيْـنًا  فَـلَـنْ  يُـقْـبَـلَ  مِـنْـهُ  وَهُـوَ  فِــيْ  الْأَخِـرَ ةِ   مِـنَ  الْـخَـٰـسِـرِيْـنَ ]  (853:)
“మరియు ఎవరైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించ బడదు మరియు అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరుతాడు” {ఖుర్ఆన్ 3వ అధ్యాయం ‘ఆలె ఇమ్రాన్’ (మర్యం తండ్రి అయిన ఇమ్రాన్ కుటుంబం) లోని 85వ ఆయత్ యొక్క భావపు అనువాదం}

حدثنا عبدُ الله بنُ يُوسفَ : حدثنا الليث :حدثنا سعيد الـمقبري، عن أبيه، عن أبي هريرة قال:قال النبي ^ :(( ما مِنَ الأنبياءِ نَبيٌّ إلا أعطي من الآيات ما مِثله آمن عليهِ البَشرُ، وَإنَّمـا كان الَّذي أوتيتُـه وحيا أوحاهُ الله إليَّ،  فأرجُو أن أكُونَ أكثرَهُم تَابعاً يوم القِيامَـةِ)).
సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 379వ హదీథ్ లో నమోదు చేయబడిన అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ప్రవక్తలలో అద్భుతాలు ఇవ్వబడని ప్రవక్తలు లేరు, వేటి వలనైతే ప్రజలు విశ్వసించేవారో. అలాగే నాకు ఈ దివ్యవాణి (ఒక మహిమగా) ఇవ్వబడినది దేనినైతే అల్లాహ్ నా పై అవతరింపజేసాడో. కాబట్టి, పునరుత్థాన దినమున వేరే ఇతర ప్రవక్తల అనుచరుల సంఖ్య కంటే నా అనుచరుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాను”

حدثنا محمد بن عبادة : أخبرنا يزيد : حدثنا سليم بن حيان، وأثنى عليه : حدثنا سعيد بن ميناء: حدثنا أو سمعت جابر بن عبدالله يقول: جاءت ملا ئكة إلى النبي ^  و هو نائم، فقال بعضُهم : إنه نائم ، وقال بعضهم :إن العين نائمة والقلب يقظان، فقالوا : إنَّ لصا حبكم هذا مثلاً، فاضربوا له مثلاً، فقال بعضهم : إنه نائم، و قال بعضهم : إنَّ العين نائمةٌ، والقلب يقظان، فقالوا: مثله كمثل رجل بنى داراً، وجعل فيها مأدبة وبعث داعياً، فمن أجاب الداعي دخل الدار وأكل من المأدبة، ومن لم يجب الداعي لم يدخل الدار و لم يأكل من المأدبة. فقالوا : أوَّلوها  له يفقهها، فقال بعضهم : إنه نائم، وقال بعضهم إن العين نائمة والقلب يقظان، فقالوا : فالدار، الجنة، والداعي محمد ^ ،  فمن أطاع محمداً  ^ فقد أطاع الله، ومن عصى محمداً   ^    فقد عصى الله،  و محمد ^  فرق بين الناس.  تابعه قتيبة، عن ليثٍ، عن خالدٍ، عن سعيد بن أبي هلالٍ، عن جابرٍ: حرج علينا النبي ^.
సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 385వ హదీథ్ లో నమోదు చేయబడిన జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు-
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుకుని ఉన్నప్పుడు కొందరు దైవదూతలు ఆయన వద్దకు వచ్చారు. వారిలో కొందరు ఇలా పలికారు “ఆయన నిద్ర పోతున్నారు”. అప్పుడు మిగిలిన వారు ఇలా వ్యాఖ్యానించారు “ఆయన కళ్ళు నిద్ర పోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది”. అప్పుడు వారిలా పలికారు “మీ యొక్క ఈ సహచరుడిలో ఒక నిదర్శనం ఉన్నది”. ఆ తర్వాత వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన లోని నిదర్శనాన్ని కనిబెడదాం” అప్పుడు వారిలోని మరొక దైవదూత ఇలా జవాబిచ్చారు “ఆయన నిద్రపోతున్నారు” మరొక దైవదూత మళ్ళీ “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అని తిరిగి పలికారు.
అప్పుడు వారిలా పలికారు “ఆయనలోని నిదర్శనం (ఉదాహరణ) ఇలా ఉన్నది – క్రొత్తగా ఇల్లు కట్టిన ఒక వ్యక్తి, విందు భోజనం ఏర్పాటు చేసి, ప్రజలను ఆహ్వానించటానికి దూతను (వార్తాహరుడిని) పంపినాడు. అప్పుడు ఎవరైతే ఆ దూత యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఆ ఇంటిలో ప్రవేశించారో, వారు విందు భోజనం ఆరగించారు (తిన్నారు). ఇంకా ఎవరైతే ఆ వార్తాహరుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదో, వారు ఆ ఇంటిలో ప్రవేశించనూ లేదు మరియు విందు భోజనం తిననూ లేదు” అప్పుడు మిగిలిన దైవదూతలు ఇలా పలికారు “ఈ దృష్టాంతాన్ని (ఉదాహరణను) ఆయనకు వివరించినట్లయితే, ఆయన కూడా దీనిలోని నిగూఢార్థాన్ని తెలుసుకోగలరు” అప్పుడు వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన నిద్రపోతున్నారు” మిగిలిన వారు మళ్ళీ ఇలా పలికారు “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అప్పుడు వారు మళ్ళీ ఇలా పలికారు “ఉదాహరణలోని క్రొత్త ఇల్లు స్వర్గానికి ఉపమానంగా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విందు భోజనానికి పిలిచిన దైవదూత (వార్తాహరుడు) కు ఉపమానంగా మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను విధేయతగా అనుసరిస్తారో, వారు అల్లాహ్ ను విధేయతగా అనుసరించినట్లే. మరియు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపుతారో, వారు అల్లాహ్ కు అవిధేయత చూపినట్లే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివ్యసందేశం ద్వారా ప్రజలలోని దైవభక్తులను వేరు చేసారు, చెడు నుండి మంచిని వేరుపర్చారు మరియు అవిశ్వాసుల నుండి విశ్వాసులను విడదీశారు”
حدَّثنا مُحَمَّد بن سِنانٍ: حدَّثنا فليح بن سليمان: حدَّثنا هلال بن علي‘ عن عبد الرَّحمنِ بنِ أبي عمرة، عن أبي هريرة قال : قال رسول الله^: أنا أوْلى النَّاسِ بعيسى ابنِ مريم في الدُّنيا والآخرة، والأنبِـياء إخوةٌ لعَلاَّت، أُمَّهاتهم شتَّى ودينهم واحد. وقال إبراهيم بن طهمان، عن موسى بن عُقبة، عن صفوان بن سُليم، عن عطاء بن يسار، عن أبي هريرة رضي الله عنه قال :قال رسول الله ^
సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 4వ గ్రంథపు 652వ హదీథ్ లో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:
“ఈ లోకంలోను మరియు పరలోకంలోను మర్యం కుమారుడైన ఈసా-యేసు (అలైహిస్సలాం) కు మొత్తం మానవజాతిలో నేనే అత్యంత దగ్గరి వాడిని. ప్రవక్తలు తండ్రి తరుపున సోదరులు, వారి తల్లులు వేరు, కాని వారి ధర్మం ఒక్కటే (అదే ఏకైక దైవారాధన)”
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరుడనే సత్యాన్ని  (Prophethood ను) తప్పక విశ్వసించవలెను.
حدَّثني يونس بن عَبدالأعلى: أخبرنا ابنُ وهْب قال: وأخبرني عمرو أنَّ أبا يونس حدَّثه عن أبي هُريرة عن رسول الله صلّى الله عليه و سلَّم أنَّه قال: والذي نَفْس مُحمَّد بِيده لا يَسمَعُ بِي أحدٌ من هذه الأُمَّةِ يهودي ولا نصراني ثمَّ يموت ولم يؤمن بالذي أُرسلْتُ بِه إلاَّ كان من أصحاب النَّار. (رواه مسلم في كتاب الإيمان)
సహీహ్ ముస్లిం హదీథ్ సంకలనంలోని – విశ్వాసమనే మొదటి హదీథ్ గ్రంథపు 24వ భాగంలో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ఎవరి చేతిలో ముహమ్మద్ యొక్క ఆత్మ ఉన్నదో ఆయన (అల్లాహ్) సాక్షిగా, యూదులలో మరియు క్రైస్తవులలో నా గురించి విని, ఏ దివ్యసందేశంతో (ఏకైక దైవారాధనా సందేశం) నేను పంపబడినానో, దానిని విశ్వసించకుండా చనిపోయే వారెవరూ ఉండరు. కాని వారిలో ఎవరైతే అలా విశ్వసించక చనిపోతారో, వారు నరకాగ్ని నివాసులుగా మిగిలిపోతారు.”(ఖుర్ఆన్ లోని 3:116వ వచనం కూడా చూడండి)

“అల్లాహ్ పై విశ్వాసం” అంటే ఏమిటి ?(Belief in Allah)

            Belief in Allah


‘అల్లాహ్ పై నిజమైన విశ్వాసం చూపడం’ యొక్క అనేక శుభాల గురించి నేను చదివాను మరియు విన్నాను. స్పష్టంగా అర్థం చేసుకునేలా, చిత్తశుద్ధితో ఆచరించేలా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరుల పద్ధతికి భిన్నంగా ఉండే ప్రతి దాని నుండి నన్ను దూరంగా ఉంచేలా ‘అల్లాహ్ పై విశ్వాసం’ గురించి వివరించమని మిమ్ముల్ని వేడుకుంటున్నాను.
అల్హందులిల్లాహ్.
‘అల్లాహ్ పై విశ్వాసం’ అంటే ఆయన ఉనికిని, ఆయన దైవత్వాన్ని, ఆయన శుభనామాలను మరియు దివ్యలక్షణాలను దృఢంగా విశ్వసించడం.
అల్లాహ్ పై విశ్వాసంలో నాలుగు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వీటిని విశ్వసిస్తారో, వారు నిజమైన విశ్వాసులు.
1 – అల్లాహ్ యొక్క ఉనికిని విశ్వసించడం. 
‘అల్లాహ్ యొక్క ఉనికి’ హేతుబద్ధంగా మరియు మానవ స్వభావసిద్ధంగా ధృవీకరించబడిన ఒక వాస్తవ విషయం. దీనిని షరిఅహ్ లో తెలుపబడిన అనేక వాస్తవాలు నిరూపిస్తున్నాయి.
(i)  అల్లాహ్ ఉనికిని నిరూపించే మానవ స్వాభావిక ఋజువు:
తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతి మానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరం లేక నేర్చుకోవలసిన అవసరం లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఫిత్రా (మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస) స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో చేసి వేస్తారు.”  [సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం.]
(ii) అల్లాహ్ ఉనికిని నిరూపించే హేతుబద్ధమైన ఋజువు:
భూత, భవిష్య మరియు వర్తమాన కాలాలలోని ఈ సృష్టితాలన్నీ తమను ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే అవి తమను తాము సృష్టించుకోలేవు లేదా ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాజాలవు.
అవి తమకు తాముగా ఉనికిలోనికి రావటం అసాధ్యం. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు: ఉనికి లోనికి రాక ముందు, అది సృష్టించబడనే లేదు. కాబట్టి, అదెలా తనను తాను సృష్టించుకోగలదు?! అలాగే, ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రావడం కూడా అసంభవమైనదే. ఎందుకంటే, ఏది సంభవించినా దానికొక కారణముంటుంది. అంతేగాక, ఈ సృష్టి అత్యాద్భుతమైన మరియు అత్యంత ఖచ్చితమైన విధంగా సృష్టించబడింది. మరియు ఇతర సృష్టితాల మధ్య ప్రతిదీ పొందికగా అమర్చబడింది. కారణానికి మరియు పర్యవసనానికి మధ్య దృఢమైన సంబంధం ఉంది. ఇవన్నీ నిరూపిస్తున్నది ఏమిటంటే ఈ సృష్టి ఏదో ఒక హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాలేదు. ఎందుకంటే ఏదైనా హఠాత్తుగా జరిగితే, దాని పర్యవసానం ఇంత ఖచ్ఛితంగా మరియు ఇంత పరిపూర్ణంగా ఉండదు. కాబట్టి ఇది అంత ఖచ్చితమైన సమతుల్యంలో ఎలా మిగిలి ఉంది?
ఒకవేళ ఇవి తమకు తాముగా సృష్టించుకోవడం లేక ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికి లోనికి రావడం జరగనట్లయితే, వీటిని ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉండి ఉండాలి. ఆయనే అల్లాహ్ – సకల లోకాల ప్రభువు.
అల్లాహ్ ఈ హేతుబద్ధమైన సాక్ష్యాన్ని మరియు తిరుగులేని ఋజువును సూరహ్ అత్తూర్ లో పేర్కొన్నాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం):
“ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా?” [అత్తూర్ 52:35]
అవి సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు. వాటికవే సృష్టించుకోవడమూ జరగలేదు. కాబట్టి, మహోన్నతుడైన అల్లాహ్ యే వాటి సృష్టికర్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అత్తూర్ పఠిస్తూ, ఈ ఆయతు వద్దకు వచ్చినపుడు, జుబైర్ ఇబ్నె ముతిమ్ దానిని విన్నాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం):
“ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా? లేదా భూమ్యాకాశాలను అవి సృష్టించాయా? లేదు, వారు దృఢమైన విశ్వాసం కలిగి లేరు. లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క భాండాగారాలేమైనా ఉన్నాయా? లేదా తమ ఇష్టానుసారం చేయగల అధికారం కలిగి ఉన్న నిరంకుశులా వారు? ”  [అత్తూర్ 52:35-37]
ఆ కాలంలో జుబైర్ అవిశ్వాసిగా జీవించేవాడు. ఖుర్ఆన్ వచనాలు విన్న తర్వాత అతడిలా పలికినాడు: “నా గుండె దాదాపు ఆగిపోయినట్లయింది. దైవవిశ్వాసం నా హృదయంలో ప్రవేశించిన మొట్టమొదటి క్షణమది.” సహీహ్ అల్ బుఖారీ.
మరింత స్పష్టంగా వివరించే ఒక ఉదాహరణ క్రింద పేర్కొంటున్నాము:
ఒక అందమైన రాజభవనం, దాని చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, వాటి మధ్య నదుల ప్రవాహం, సకల సౌకర్యాలు, అన్ని రకాల భోగభాగ్యాలతో కూడిన అలంకరణలు – ఇదంతా ఎవ్వరూ నిర్మించకుండా, హఠాత్తుగా దానికదే ఉనికిలోనికి వచ్చిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే, వెంటనే మీరు దానిని తిరస్కరిస్తారు, నోటి మీదే అది ఒక పచ్చి అబద్ధం అని చెప్పేస్తారు. మరియు అది ఒక మూర్ఖమైన మాటగా పరిగణిస్తారు. మరి, భూమ్యాకాశాలతో, నక్షత్రాలతో మరియు అత్యద్భుత, సవిశాల మరియు ఖచ్చితమైన సమతుల్యంతో కనబడుతున్న ఈ విశ్వం, దాని సృష్టికర్త ప్రమేయం లేకుండా దానికదే సృష్టించుకోవడం సాధ్యమా లేదా ఏదైనా హఠాత్పరిణామం వలన ఉనికిలోనికి రావడం సాధ్యమా?!
ఏడారిలో నివసించే ఒక పల్లెవాసి ఈ హేతుబద్ధమైన ఋజువును గ్రహించి, ఇతరులు అడిగిన ఈ ప్రశకు అతడు చాలా స్పష్టంగా బదులిచ్చిన ఈ సంభాషణను ఒకసారు పరిశీలిద్దాం. “నీ ప్రభువు గురించి నీవు ఎలా తెలుసుకోగలవు?” అతడి జవాబు: “ఒకవేళ ఒంటె పేడ నీకు కనబడితే, ఆ దారి గుండా ఏదో ఒక ఒంటె వెళ్ళిందని నీవు గ్రహిస్తావు. అలాగే ఒకవేళ మనిషి పాదాల గుర్తులు నీకు కనబడితే, ఆ దారి గుండా ఒక మనిషి వెళ్ళినట్లు నీవు గ్రహిస్తావు. మరి, నక్షత్రాలతో నిండిన ఈ ఆకాశం, పర్వత మార్గాలతో కూడిన ఈ భూమండలం మరియు ఎత్తైన అలలతో కూడిన ఈ సముద్రాలు – ఇవన్నీ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడి ఉనికిని నిరూపించడం లేదా?”
2 – అల్లాహ్ యొక్క సార్వభౌమత్వాన్ని విశ్వసించడం. 
అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ప్రభువు – ఆయనకు భాగస్వాములు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరు.
సృష్టించే, ఆధిపత్యం చెలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే ప్రభువు. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ యొక్క పలుకులు ఇలా పేర్కొనబడినాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“నిశ్చయంగా, ఈ సృష్టి మరియు శాసనం ఆయనదే”  [అల్ అరాఫ్ 7:54]
“ప్రకటించు(ఓ ముహమ్మద్): ‘భూమ్యాకాశాల నుండి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు? లేదా వినికిడి శక్తి మరియు దృష్టి ఎవరి అధీనంలో ఉన్నాయి? మరియు మరణించిన వారిని తిరిగి సజీవం చేసేది మరియు సజీవంగా ఉన్నవారిని మరణింపజేసేది ఎవరు? విశ్వవ్యవహారాలను నడిపేది ఎవరు?’ (అని ప్రశ్నిస్తే), వారు ‘అల్లాహ్’ అని బదులిస్తారు. అపుడు వారినిలా ప్రశ్నించు: ‘మరి మీకు అల్లాహ్ శిక్షల భయం లేదా (ఆయన ఆరాధనలలో భాగస్వాములను చేర్చినందుకు?’”  [యూనుస్ 10:31]
“భూమ్యాకాశాల మధ్య ఉన్న వాటి ప్రతి వ్యవహారాన్నీ ఆయనే నియంత్రిస్తాడు మరియు ఆయనే నడిపిస్తాడు; ప్రతిదీ ఆయన వైపుకే మరలుతుంది” [అస్సజదహ్ 32:5]
“ఆయనే అల్లాహ్, మీ ప్రభువు; విశ్వసామ్రాజ్యం ఆయనదే. ఆయనను వదిలి ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో, పిలుస్తున్నారో, అలాంటి వారు (విగ్రహాలు, అసత్యదైవాలు) ఖర్జురపు పండు పై నుండే పల్చటి దారం పోగుకు కూడా యజమానులు కారు.” [ఫాతిర్ 35:13]
సూరతుల్ ఫాతిహా లోని అల్లాహ్ పలుకులు (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“తీర్పుదినం (ప్రతిఫల దినం, అంతిమ దినం) యొక్క (ఏకైక) ప్రభువు [మాలికి యౌమిద్దీన్]” [అల్ ఫాతిహా 1:4]
మరో పద్ధతిలో ఇది మలికి యౌమిద్దీన్ అని పఠించబడుతుంది. ఒకవేళ మనం ఈ రెండు పఠనా పద్ధతులను జత చేస్తే, ఒక అద్భతమైన భావం మన ముందుకు వస్తుంది – మాలిక్ (యజమాని) కంటే మలిక్ (సార్వభౌముడు) ఎక్కువ శక్తి మరియు అధికారం కలిగి ఉంటాడు. అయితే ఒక్కోసారి పేరుకు మాత్రమే అతడు రాజుగా చెలామణీ అవుతాడు, రాజ్యవ్యవహారాలపై అతనికెలాంటి నియంత్రణా, ఆధిపత్యమూ ఉండదు. అలాంటి స్థితిలో అతడు కేవలం నామ మాత్రపు రాజే గాని యజమాని కాడు. అయితే, అల్లాహ్ సార్వభౌముడు మరియు యజమాని కూడా అయి ఉండటం వలన, ఆయన యొక్క సార్వభౌమత్వం మరియు విశ్వవ్యవహారాలన్నింటిపై ఆయన యొక్క సాటి లేని నియంత్రణను ఇది ధృవీకరిస్తున్నది.
3 – అల్లాహ్ యొక్క ఏక దైవత్వాన్ని విశ్వసించడం 
i.e., కేవటం అల్లాహ్ మాత్రమే నిజమైన ఏకైక ఆరాధ్యుడు, ఆయనకెవరూ సాటి లేరు మరియు ఆయనకెవరూ భాగస్వాములు లేరు.
అల్ ఇలాహ్ అంటే ప్రేమించబడేవాడు. ప్రేమ మరియు గౌరవాభిమానాలతో ఆరాధించబడేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“మరియు మీ ఆరాధ్యుడు – ఒక్కడే. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. అనంత కరుణా మయుడు మరియు అపార కృపాశీలుడు” [అల్ బఖరహ్ 2:163]
“ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు అనడానికి అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు, దైవదూతలు మరియు జ్ఞానం కలిగిన వారు కూడా. ఆయనే తన సృష్టిని న్యాయంగా నడుపుతున్నాడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడూను.” [ఆలె ఇమ్రాన్ 3:18]
అల్లాహ్ ను వదిలి, ఆరాధించే ప్రతి దాని యొక్క దైవత్వం అసత్యమైనదే. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“ఎందుకంటే అల్లాహ్ మాత్రమే సత్యం. ఆయనతో పాటు (లేక ఆయనను వదిలి) వారు ఆరాధిస్తున్న వన్నీ అసత్యమైనవే. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, ఘనమైన వాడూను.” [అల్ హజ్  22:62]
దేవుడిగా పిలవబడినంత మాత్రాన వాటికి దైవత్వం చేకూర్చదు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“అవన్నీ మీరూ మరియు మీ తాతముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఎలాంటి దైవత్వాన్నీ అల్లాహ్ వాటికి ప్రసాదించలేదు” [అల్ నజమ్ 53:23]
యూసుఫ్ అలైహిస్సలాం జైలులో ఉంచబడినపుడు, అక్కడి రక్షకభటుడితో ఇలా పలికినట్లు అల్లాహ్ మనకు తెలిపినాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం:
“అనేక మంది దేవుళ్ళు ఉండటం మంచిదా లేక ఏకైకుడు మరియు తిరుగులేని వాడైన ఒక్క అల్లాహ్ మాత్రమే ఉండటం మంచిదా? ఆయనను తప్ప ఇంకెవ్వరినీ ఆరాధించవద్దు. ఆయనను వదిలి నీవూ మరియు నీ తల్లిదండ్రులు కొలుస్తున్న దేవుళ్ళ పేర్లకు అల్లాహ్ ఎలాంటి దైవత్వాన్నీ ప్రసాదించలేదు.” [12:39-40]
అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు. ఆయన హక్కులో ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యమూ లేదు – ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత అయినా, ప్రజలను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు పిలవటానికి ఆయన పంపిన ఏ ప్రవక్త అయినా. ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం:
“’లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు సందేశహరుడిని తప్ప, మేము మరే సందేశహరుడినీ నీకు పూర్వం పంపలేదు. కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించు” [అల్ అంబియా 21:35]
“నిశ్చయంగా మేము ప్రతి సమాజంలో ఒక సందేశహరుడిని (ఇలా పిలిచేందుకు) పంపాము: “అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, తాగూత్ (అసత్యదేవుళ్ళ) లకు దూరంగా ఉండండి.” [అన్నహల్ 16:36]
అయితే, బహుదైవారాధకులు ఈ పిలుపును తిరస్కరించి, అల్లాహ్ తో పాటు ఆరాధించడానికి, వేడుకోవడానికి మరియు అర్థించడానికి ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు.
4 – అల్లాహ్ యొక్క దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను విశ్వసించడం. 
i.e., తన దివ్యగ్రంథంలో మరియు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో (సున్నతులలో) స్వయంగా అల్లాహ్ ధృవీకరించిన తన యొక్క దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను ఆయన ఔన్నత్యానికి సరిపోయేటట్లుగా, ఆయనకు ప్రయోజనం కలిగేటట్లుగా, వాటి భావాలలో ఎలాంటి మార్పులు – చేర్పులు చేయకుండా, వాటిని సృష్టితాలతో పోల్చుతూ రకరకాల ప్రశ్నలు వేయకుండా మనం కూడా ధృవీకరించడం. ఖుర్ఆన్ ఆయతు యొక్క భావానువాదం:
“అత్యున్నతమైన నామాలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. కాబట్టి వాటి ద్వారా ఆయనను వేడుకోండి. ఆయన దివ్యనామాలను తిరస్కరించే వారిని, నమ్మని వారిని విడిచి పెట్టండి. వారు చేస్తున్న దానికి తగిన ప్రతిఫలం పొందుతారు.” [అల్ అరాఫ్ 7:180]
ఈ వచనం సూచిస్తున్నదేమిటంటే, అల్లాహ్ యొక్క నామాలు అత్యన్నతమైన దివ్యనామాలు.
మరియు అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు. (ఖుర్ఆన్ వచనం యొక్క తెలుగు భావానువాదం):
“భూమ్యాకాశాలలో ఆయన ప్రస్తావనయే అత్యున్నతమైన ప్రస్తావన. ఆయన మహోన్నతుడు, అత్యంత వివేకవంతుడు” [అర్రూమ్ 30:27]
పరిపూర్ణత్వపు లక్షణాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందునని ఈ వచనం సూచిస్తున్నది, ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని సూచించే లక్షణమే “మహోన్నతమైన లక్షణం”. ఈ రెండు వచనాలు సూచిస్తున్నదేమిటంటే, అత్యంత ఉన్నతమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు సాధారణంగా అల్లాహ్ కు మాత్రమే చెందును. ఖుర్ఆన్ మరియు సున్నతులలో దీనిని వివరంగా తెలిపే సమాయారం చాలా ఎక్కువ మోతాదులో ఉంది.
జ్ఞానం యొక్క ఈ విభాగం అంటే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను వివరించే జ్ఞానం గురించి సమాజంలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇది చాలా వివాదాస్పదమైన విభాగం. దీని విషయంలో సమాజం అనేక వర్గాలుగా విడిపోయింది.
దీని గురించి అల్లాహ్ పంపిన ఈ ఆదేశాలను తు.చ. తప్పక శిరసావహిచాలనేది మా అభిప్రాయం.  (ఖుర్ఆన్ ఆయతు యొక్క భావానువాదం) :
“ఏదైనా విషయం గురించి మీలో మీకు భేదాభిప్రాయాలు వస్తే, దానిని అల్లాహ్ మరియు ఆయన యొక్క సందేశహరుడి వైపుకు మరలండి – ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే వారే అయితే.” [అన్నిసాఅ 4:59]
మనం ఈ భేదాబిప్రాయాన్ని కూడా అల్లాహ్ యొక్క అంతిమ గ్రంథం మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకే మరలిద్దాం – సన్మార్గంలో నడిచిన సలఫ్ (ముందుతరం), సహాబాలు, తాబయీన్ ల నడిచిన మరియు ఈ ఖురఆన్ ఆయతులు మరియు హదీథులు అర్థం చేసుకున్న విధానం నుండే మనం కూడా ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అన్వేషిస్తూ. ఎందుకంటే ఈ సమాజంలో వారు అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించిన విషయాలలో అత్యుత్తమ జ్ఞానవంతులు. సహాబాల గురించి వివరిస్తూ, అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు తన సత్యవాక్కులను ఇలా తెలిపారు: “ఎవరైనా సన్మార్గాన్ని అనుసరించాలనుకుంటే, (తమ జీవితాంతం సన్మార్గంపై నడుస్తూ) మరణించిన సజ్జనుల మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే ప్రస్తుతం జీవించి ఉన్న సజ్జనుల విషయంలో చివరి క్షణం లోపల వారు సన్మార్గాన్ని వదిలి పెట్టరనే గ్యారంటీ ఏదీ లేదు. సహాబాలు ఎంత గొప్ప వారంటే, వారి హృదయాలు మన సమాజంలో మిగిలిన వారందరి కంటే అతి స్వచ్ఛమైనవి, లోతైన అవగాహనను కలిగి ఉండినవి,  ఆడంబరాలకు దూరంగా ఉండినవి, అతి తక్కువ క్లిష్టమైనవి. అంతేగాక అల్లాహ్ వారిని తన ధర్మ స్థాపన కొరకు మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సహచరులుగా ఉండుట కొరకు ఎంచుకున్నాడు. కాబట్టి వారి హక్కును మనం తప్పక గుర్తించాలి. మనం వారి మార్గదర్శకత్వాన్ని తప్పక స్వీకరించాలి. ఎందుకంటే వారు నిజమైన మార్గదర్శకత్వాన్ని అనుసరించారు.” ఎవరైతే ఈ విషయంలో సలఫ్ మార్గాన్ని వదిలి, వేరే మార్గాన్ని అవలంబిస్తారో, వారు తప్పు చేసినట్లే మరియు తప్పుడు దారిని అవలంబించినట్లే. అంతేగాక విశ్వాసుల (మోమిన్ల) మార్గాన్ని వదిలి, వేరే మార్గంపై నడుస్తున్న వారవుతారు. అలాంటి వారిని అల్లాహ్ ఇలా హెచ్చరిస్తున్నాడు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):
“స్పష్టంగా సన్మార్గం చూపబడిన తర్వాత ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరుడితో విభేదిస్తారో, వారు విశ్వాసుల మార్గాన్ని కాకుండా వేరే మార్గంలో నడుస్తున్నట్లే. వారు ఎంచుకున్న (తప్పుడు) మార్గంలోనే మేము వారిని ముందుకు పోనిస్తాము మరియు నరకంలో శిక్షిస్తాము – ఎంత చెడు గమ్యం వారిది!” [అన్నిసాఅ 4:115]
సరైన మార్గదర్శకత్వాన్ని పొందాలంటే, సహాబాలు విశ్వసించినదే మనం కూడా తప్పకుండా విశ్వసించాలని అల్లాహ్ ఈ ఆయతులో స్పష్టంగా నిర్దేశిస్తున్నాడు. (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):
“కాబట్టి మీరు (సహాబాలు) విశ్వసిస్తున్నట్లుగా ఒకవేళ వారు కూడా విశ్వసిస్తే, వారు సన్మార్గంపై ఉన్నట్లే” [అల్ బఖరహ్ 2:137]
ఎవరైతే సలఫ్ మార్గం నుండి దూరమవుతారో మరియు దాన్ని వదిలి వేరే మార్గాన్ని అవలంబిస్తారో అలాటి ప్రతి ఒక్కరూ సరైన మార్గదర్శకత్వాన్ని పొందే అవకాశం జారవిడుచుకున్న వారవుతారు మరియు దిక్కులేని వారవుతారు.
దీని ఆధారంగా, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాల విషయంలో దేనినైతే స్వయగా అల్లాహ్ యే ధృవీకరించాడో మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించారో, దానినే మనం అనుసరించాలి. ఖుర్ఆన్ మరియు సున్నతులను మనం ఆధారంగా తీసుకోవాలి, సహాబాలు వాటిని నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలి. ఎందుకంటే ఈ విషయంలో వారు మన సమాజంలో అందరి కంటే ఎక్కువ జ్ఞానం మరియు ఉత్తమ జ్ఞానం కలిగి ఉండినారు.
అయితే మనం క్రింది నాలుగు విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా వీటిలో ఏ ఒక్క దానిని అనుసరించినా, అలాంటి వారు తమకు ఆదేశించబడిన దానిని శిరసావహించకుండా, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలపై తగిన విధంగా నిజమైన విశ్వాసం పొందని వారవుతారు. వీటికి దూరంగా ఉండకుండా, ఎవరైనా సరే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించలేరు. ఈ నాలుగు: తహ్రీఫ్ (మార్పుచేర్పులు), తఆతీల్ (తిరస్కారం), తమ్హీల్ (అల్లాహ్ ను సృష్టితాలతో పోల్చడం) మరియు తకైఫ్ (ఎందుకు, ఎలా అని చర్చించడం).
కాబట్టి, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించడమంటే “తన దివ్యగ్రంథంలో మరియు తన ప్రవక్త యొక్క సున్నతులలో అల్లాహ్ స్వయంగా ధృవీకరించిన తన దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను వాటి భావార్థాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా, తిరస్కరించకుండా లేదా ఎందుకు, ఎలా అని ప్రశ్నించకుండా లేదా వాటిని సృష్టితో పోల్చకుండా ఆయన స్థాయికి తగినట్లు మనం కూడా వాటిని యథాతథంగా ధృవీకరించడం.”
మనం దూరంగా ఉంచవలసిన ఈ నాలుగు విషయాల గురించి క్లుప్తంగా ఇక్కడ చర్చించుకుందాము:
(i) తహ్రీఫ్ (మార్పులు – చేర్పులు చేయడం) 
అంటే, ‘అత్యుత్తమమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును’ అనే వాస్తవ భావార్థానికి భిన్నంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆమోదయోగ్యం కాని విధంగా ఖుర్ఆన్ ఆయతుల మరియు సున్నతు వచనాల భావార్థాలలో మార్పులు – చేర్పులు చేయడం.
ఉదాహరణకు:
అనేక ఆయతులలో వచ్చిన ‘అల్లాహ్ చేయి’ అనే పదం యొక్క భావార్థాన్ని వారు ఆయన యొక్క అనుగ్రహాలను లేదా శక్తిని సూచిస్తుందని మార్చడం.
(ii) తఆతీల్ (తిరస్కరించడం) 
అంటే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరిస్తూ, అవన్నీ అల్లాహ్ కు చెందవని లేదా వాటిలో కొన్ని అల్లాహ్ కు చెందవని చెప్పడం.
ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొనబడిన అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరించే ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను నిజంగా నమ్మనట్లే.
(iii) తమ్హీల్ (అల్లాహ్ ను ఆయన యొక్క సృష్టితాలతో పోల్చడం) 
అంటే, అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడం. ఉదాహరణకు, అల్లాహ్ చేయి కూడా మానవుడి చేతి లాంటిదే అనడం, అల్లాహ్ యొక్క వినికిడి శక్తి కూడా మానవుడి వినికిడి శక్తి లాంటిదే అనడం, అల్లాహ్ తన అర్ష్ పై అధిష్టించడం అంటే మానవుడు ఒక కుర్చీ పై కూర్చోవడం లాంటిదని చెప్పడం …. మొదలైనవి. నిస్సందేహంగా, అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడమనేది చాలా తప్పు మరియు ఒక పచ్చి అబద్ధం వంటిది. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయతులు ఇలా ఉన్నాయి, (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“ఆయనను పోలినదేదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడూ, చూసేవాడూను.” [అష్షూరా 42:11]
(iv) తకైఫ్ (ఎలా సంభవమని చర్చించడం) 
అంటే, ఎవరైనా ఒక వ్యక్తి పరిమితమైన తన ఊహలకు లేక ఆలోచనలకు మాటల రూపాన్నిస్తూ, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను ఎలా సాధ్యం అనే విషయం పై చర్చించడం.
ఖచ్చితంగా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. మానవుడికి వాటి గురించి తెలీదు. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయతులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“కానీ, ఆయన జ్ఞానంలో నుండి దేనినీ వారేనాడూ ఆవరించలేరు” [తాహా 20:110]
ఎవరైనా ఈ నాలుగు విషయాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారు నిజంగా అల్లాహ్ ను విశ్వసించనట్లే.
మన అంతిమ ఘడియ వరకు సన్మారంలోనే నిలకడగా నడుపమని మనం అల్లాహ్ ను వేడుకుంటున్నాము.
మరియు అల్లాహ్ యే సమస్త విషయాలు ఎరుగును.
రిఫరెన్స్ : రిసాలత్ షరహ్ ఉసూల్ అల్ ఈమాన్ – షేఖ్ ఇబ్నె ఉథైమీన్.

మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? (The Purpose of Creation)

          మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? 


మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? అనే చిక్కు ప్రశ్న ప్రతి మానవుడికీ తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదురవుతుంది. ఏదో ఒక సందర్బంలో ప్రతి మానవుడు  “నేనెందుకు జీవిస్తున్నాను?“, “దేనికోసం నేను ఈ భూమిపై ఉన్నాను?“, “నా జీవితలక్ష్యం ఏమిటి?” అని తనను తాను ప్రశ్నించుకోవటం కూడా జరుగుతుంది. కానీ సమాధానం కనుక్కోవటానికి మనం ఎప్పుడైనా ప్రయత్నించామా? నిజాయితీగా చూస్తే, ఆ ఆలోచనే ఇంత వరకు రానివాళ్ళు అధికంగా ఉన్నారు.
మానవజాతి సృష్టి యెక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలుపుతున్నాడు:
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి  మాత్రమే“. (ఖురాన్ 51:56)
మానవులను, జిన్నులను పుట్టించటం లోని తన ఉద్దేశం ఏమిటో అల్లాహ్ పై వాక్యం లో తెలియపరిచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులను గానీ, జిన్నాతులను గానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరించలేదు. ఒకవేళ అదే కనక అయి ఉంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ధైవారాధనకు కట్టుబడి ఉండేవారు. కానీ అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుక లోని పరమార్ధాన్ని వారికి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్ధాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.
ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా అల్లాహ్ పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో. అదేమీ కాదు. ప్రపంచంలో అవిశ్వాసులు కల్పించే చిల్లరదేవుళ్ళ లాంటివాడు కాదు అల్లాహ్.
దీనిని గురుంచి అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు:
“నేను వారినుండి జీవనోపాధిని కోరడంలేదు. వారునాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు“.
“అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు“. (ఖురాన్51:57-58)
అల్లాహ్ కు మానవుల ఆరాధన యెక్క అవసరంలేదు. ఆయన తన అవసరాలను పూర్తిచేసుకోవటం కోసం మానవులను సృష్టించలేదు.  భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ ఆరాధన వల్ల అల్లాహ్ భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగానీ అల్లాహ్ కు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.ఒక్కమానవుడు కూడా ఆయనను ఆరాధించక పోయినా ఆయన యెక్క మహొన్నత స్థానానికి ఎటువంటి హానీ కలగదు. అలాగే, ప్రతి ఒక్క మానవుడు ఆయనను ఆరాధించిన, ఆయన యెక్క మహొన్నత స్థానానికి ఎటువంటి లాభము చేకూరదు. ఆయన సంపూర్ణుడు. కేవలం ఆయన మాత్రమే ఎటువంటి అవసరాలు లేకుండా ఉనికిలో ఉన్నాడు. సృష్టించ బడిన వాటన్నింటికీ అవసరాలు ఉన్నాయి. కాబట్టి, మానవజాతికే  ఆయనను ఆరాధించే అవసరం ఉన్నది.
ఘోరాతి ఘోరమైన మహా పాపం:
పైన తెలుపబడిన సృష్టి యెక్క ఉద్దేశ్యం (అంటే అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట)తో విభేదించటమనేది మానవుడు చేయగల అత్యంత ఘోరమైన మహా పాపం. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను “అల్లాహ్ దృష్టిలో అత్యంత ఘోరమైన పాపం ఏది?” అని  అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ప్రశ్నించగా, వారిలా జవాబిచ్చినారు “అల్లాహ్ యే మీ సృష్టికర్త అయినప్పటికీ, ఆయనకు భాగస్వామ్యం కల్పించటం (షిర్క్ చేయటం)”.
సృష్టికర్తతో పాటు లేక సృష్టికర్తను వదిలి, ఇతరులను ఆరాధించటాన్ని అరబీ భాషలో షిర్క్ చేయటం అంటారు. కేవలం ఇది మాత్రమే ఎట్టి పరిస్థితిలోను, అస్సలు క్షమించబడని అత్యంత ఘోరమైన మహాపాపం. ఒకవేళ మానవుడు అటువంటి ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాప పడకుండా, క్షమాపణ కోరకుండా మరణించినట్లయితే, అల్లాహ్ వారి మిగిలిన పాపాలన్నింటినీ క్షమిస్తాడు గాని, షిర్క్ ను మాత్రం అస్సలు క్షమించడు. ఈ విషయమై అల్లాహ్ దివ్యఖురాన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు:
“నిశ్చయంగా, అల్లాహ్ తనకు  భాగస్వామి(సాటి)ని కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించాడు. మరియు అది తప్ప దేనినీ (ఏ పాపాన్ని) అయినా, ఆయన తానుకోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిన వాడే, వాస్తవానికి మహాపాపం చేసినవాడు!“(ఖురాన్ 4:48).
అల్లాహుతా’ఆలాకు  సాటి (భాగస్వాములను) కల్పించటం మహా దుర్మార్గం మరియు క్షమించరాని పాపం. కావున ఇది ఎంత మాత్రం క్షమించబడదు. ముష్రికులకు స్వర్గం నిషేధించబడినది. నిశ్చయంగా, బహుధైవారాధన (షిర్క్) గొప్ప దుర్మార్గం.

హదీథ్ అంటే ఏమిటి? – 2వ భాగం

                                హదీథ్ అంటే ఏమిటి? – 2వ భాగం


హదీథ్ రికార్డు (నమోదు) చేయటం యొక్క చరిత్ర: 
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) కాలంలో హదీథ్ లను రికార్డు (నమోదుచేయటం
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క కాలంలోనే హదీథ్ లను రికార్డుచేయటం మొదలైనది.
1. అబుహురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులలో అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా తప్ప, నా కంటే ఎక్కువగా హదీథ్ లను ఉల్లేఖించిన వారెవరూ లేరు. ఆయన వ్రాసేవారు మరియు నేను వ్రాసేవాడిని కాదు.” బుఖారి హదీస్
2. అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలిపారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి నాకు తెలిసిన ప్రతి విషయం కంఠస్థం చేయటం కొరకు నేను వ్రాస్తూ ఉండేవాడిని.కాని (మక్కాలోని ఒక తెగవారైన) ఖురైషులు  (వ్రాయకుండా) నన్ను ఆపి ఇలా చెప్పారు “నీవు ప్రతి విషయం వ్రాస్తున్నావు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కూడా  మానవుడే, ఆయన కోపగించుకుంటారు మరియు ఉల్లాసంగా కూడా మాట్లాడతారు.”అప్పుడు నేను వ్రాయటం ఆపి, ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంకు తెలియజేసాను, ఆయన తన చేతితో తన నోటివైపు చూపిస్తూ ఇలా సెలవిచ్చారు “వ్రాయి! నా ఆత్మ ఎవరి అధీనంలో ఉన్నదో, అతడి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, దీని(తన నోటి)  నుండి నిజం(సత్యసందేశం) తప్ప ఇంకేమీ బయటికి రాదు.” [అబు దావుద్  & అహ్మద్.]
3. అబు సయిద్ అల్ ఖుద్రి రదియల్లాహు అన్ హు ఇలా ఉల్లాఖిచారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సెలవిచ్చారు “నేను చెప్పేది ఏదీ వ్రాయవద్దు ఒక్క ఖుర్ఆన్ తప్ప, ఖుర్ఆన్ మినహా ఎవరైనా ఏదైనా వ్రాసినట్లైతే దానిని తుడిచి వేయవలెను.” [ముస్లిం & అహ్మద్.]
మొదటి రెండు హదీథ్ (వ్రాయటానికి అనుమతివ్వబడినదని నిరూపించేవి)లు మరియు మూడో హదీథ్ (వ్రాయటం నిషేధింపబడినదని నిరూపించేది) పరస్పరం విరుద్ధంగా ఉన్నప్పటికీ ఏకకాలంలో మూడూ నిజమైనవే ఎలా అవుతాయి?
తన సహాబాల(ప్రవక్త సహచరుల)కు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హదీథ్ లను వ్రాయటానికి అనుమతిచ్చారా లేక నిషేధించారా అనే విషయాన్ని నిర్ణయించడానికి వీలుగా ముస్లిం పండితులు కొన్ని కారణాలను ఇలా ప్రకటించారు.
1. హదీథ్ లు మరియు దివ్యఖుర్ఆన్ సందేశాలు ఒకదానిలో ఒకటి కలసి పోయి తికమక పెట్టవచ్చనే కారణంగా హదీథ్ లు వ్రాయటాన్ని జనరల్ గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించి ఉండవచ్చును.
2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కు కరక్టుగా వ్రాయగలరనే నమ్మకమన్న కొందరు సహాబాల(ప్రవక్త సహచరుల)ను మాత్రమే హదీథ్ లను వ్రాయటానికి ప్రత్యేకంగా ఆజ్ఞాపించి ఉండవచ్చను.
3. దివ్య ఖుర్ఆన్ అవతవరణ ప్రారంభదశలో  హదీథ్ లు వ్రాయటాన్ని నిషేధించి ఉండవచ్చును మరియు దివ్య ఖుర్ఆన్ అవతరణ దాదాపుగా పరిపూర్తవుతున్న దశలో అంటే ఖుర్ఆన్ నమోదవటం పూర్తవుతున్న సమయంలో  హదీథ్ లు వ్రాయటానికి ఆజ్ఞాపించి ఉండవచ్చును. అప్పటికే ఎక్కవ మంది సహాబాల (ప్రవక్త సహచరుల)కు హదీథ్ మరియు ఖుర్ఆన్ వచనాలను ఎలా గుర్తించాలో స్పష్టంగా తెలిసిపోయి ఉంటుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి  సల్లం జీవిత కాలంలో వ్రాయబడిన హదీథ్  వివరములు:
1. సత్యమైన పవిత్ర గ్రంథం – ఇది అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా వ్రాసినారు. వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క అనేక హదీథ్ లను ఇందులో నమోదు చేసినారు. దీనిని తన మనమడైన ఉమర్ బిన్ షుయైబ్ కు అందజేశారు.
2. అలీ బిన్ అబితాలిబ్ (రదియల్లాహు అన్ హుయొక్క లిఖిత పత్రం – ఇస్లాంలో ఖైదీలను విడిపించే నియమాలు,  మానవ హత్యకు పరిహారంగా ఇవ్వవలసిన సొమ్ము యొక్క లెక్కలు మరియు శరీరావయవముల నష్ట పరిహారపు సొమ్ము యొక్క లెక్కలు కలిగిన ఒక చిన్న లిఖిత పత్రం.
3. సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హుయొక్క లిఖిత పత్రం వాదోపవాదాల సమయంలో ప్రమాణం చేయటానికి మరియు సాక్ష్యమివ్వటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అనుమతిచ్చారని సాద్ బిన్ ఉబాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖన ఆధారంగా తిర్మిథి తెలిపినారు.
4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఉత్తరాల రూపంలో వేర్వేరు ప్రదేశాలలోని తన ప్రజాసేవకులకు, ఉద్యోగులకు పంపిన పరిపాలనా వ్యవహారాల ఆజ్ఞలు మరియు దానికి సంబంధించిన ఇస్లాం యొక్క నియమ నిబంధనలు.
5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తరాల రూపంలో చుట్టుప్రక్కల ఇతర మతాలకు చెందిన నాయకులకు, చక్రవర్తులకు పంపిన ఉత్తరాలు. వీటిలో ఇస్లాం గురించిన ఉపోద్ఘాతం మరియు ఇస్లాం స్వీకరించమనే ఆహ్వానం పంపబడినది.
6. ఇతర మతాల వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క శాంతి ఒడంబడికలు,ప్రాధాన్యమున్న ఒప్పందాలు, పవిత్రమైన వాగ్దానాలు. ఉదాహరణకు యూదు మతస్థులతో మదీనా పట్టణంలో చేసుకున్న శాంతి ఒప్పందాలు.
7. జవాబుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తమ సహాబా (సహచరు)లకు పంపిన వ్యవహారాల నిర్వహణ మరియు ఇస్లాం ధార్మిక విషయాలు.
ఋజుమార్గంలో నడిపబడిన ఖలీఫాల
(తొలి ఇస్లామీయ రాజ్యపాలకులకాలంలో హదీథ్ లను రికార్డు (నమోదుచేయటం –1 హజ్రీ శతాబ్దం 600-700AD
ఈ కాలంలో హదీథ్ లను వ్రాయటం కంటే ఎక్కువగా కంఠస్థం చేయటానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు మరియు సహాబా (ప్రవక్త సహచరు)లు హదీథ్ ల గురించి తక్కువగా చర్చించేవారు. ఎందుకంటే  వారు దివ్య ఖుర్ఆన్ ను నమోదు చేసే పనికే పూర్తి సమయాన్ని కేటాయించేవారు. మొదటి ఖలీఫా అబుబకర్ సిద్ధీక్ రదియల్లాహు అన్హు కాలంలో ఇస్లామియ రాజ్యపు నలువైపుల జరిగిన పలు యుద్ధాలలో అనేక మంది ఖుర్ఆన్ ను కంఠస్థం చేసిన సహాబాలు మరణించటం వలన, మొట్టమొదటి పూర్తి ఖుర్ఆన్ లిఖితప్రతిని సాధ్యమైనంత త్వరగా తయారుచేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడినది. ఆ కాలంలో హదీథ్ ల ద్వారా ప్రస్తావింపబడిన విషయాలను కొన్ని పద్ధతుల ద్వారా సహాబాలు మరియు ఖలీఫాలు అంగీకరించేవారు.
1. ఏదైనా ఇస్లామీయ ధార్మిక విషయం దివ్యఖుర్ఆన్ లో కనబడనప్పుడు లేదా వివరంగా లేనప్పుడు హదీథ్ లలో వెతకడం.
ఉదాహరణ: గాబేష్ ఇబ్నె థుయైబ్ రదియల్లాహు అన్ హు ఇలా తెలిపారు – ఒక ముసలమ్మ ఖలీఫా అబూబకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్ హు దగ్గరకు వచ్చి తనకు రావలసిన వారసత్వపు హక్కును ఇవ్వమని అడుగుతుంది. దివ్యఖుర్ఆన్ లో దానికి సంబంధించిన ఎటువంటి ఆదేశాలు కనబడలేదని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి కూడా ఎటువంటి ఆదేశాలు వినలేదని ఖలీఫా  జవాబిస్తారు. తర్వాత మిగిలిన సహాబాలను ఈ విషయం గురించి అడుగుతారు. అక్కడున్న వారిలో నుండి అల్ ముగీరా ఇబ్నె షోబా రదియల్లాహు అన్ హు  లేచి నిలబడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఆవిడకు 6వ వంతు ఇవ్వడం చూసానని సాక్ష్యమిస్తారు. అప్పుడు ఖలీఫా ఆ సహాబీతో ఆ సమయంలో ఇంకెవరైనాసాక్ష్యమున్నారా? అని అడుగుతారు. అక్కడున్న వారిలో నుండి ముహమ్మద్ ఇబ్నె సలామా రదియల్లాహు అన్ హు లేచి అల్ ముగీరా సాక్ష్యాన్ని ధృవీకరిస్తారు. అప్పుడు ఖలీఫా అబుబకర్ రదియల్లాహు అన్ హు ఆవిడకు ఇవ్వవలసిన 6వ భాగం ఇచ్చివేస్తారు. (అల్ థహాబీ-తథ్కిరత్ అల్ హఫ్ఫాజ్ p2)
2. దివ్య ఖుర్ఆన్ ద్వారా మరియు ఇస్లామీయ సిద్ధాంతాల ద్వారా హదీథ్ ల పై సమాలోచన చేయటం.
ఒకవేళ దివ్య ఖుర్ఆన్ ఆయత్ లకు గాని ఇస్లామీయ సిద్ధాంతాలకు గాని హదీథ్ వ్యతిరేకమౌతున్నట్లైతే, ఆ హదీథ్ ను తిరస్కరించి, తప్పుగా అన్వయించి ఉండవచ్చనే ఉద్దేశంతో దానిని ఆచరించకుండా వదిలివేయటం జరిగేది.
ఉదాహరణఉమర్ బిన్ ఖత్తాబ్ మరియు వారి కుమారుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఒక హదీథ్ ను ఇలా ఉల్లేఖిస్తున్నట్లుగా ఆయేషా రదియల్లాహుఅన్హా విన్నారు-ప్రవక్త ముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు “బంధువులు శోకిస్తుండటం వలన చనిపోయినవారు శిక్షకు గురౌతారు” ఆవిడ ఇలా తెలిపారు – “అల్లాహ్ ఉమర్ పై దయ చూపుగాక, నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను, చనిపోయిన వారి కోసం ఏడుస్తున్న బంధువుల కారణంగా అల్లాహ్ ఆ చనిపోయిన విశ్వాసులను శిక్షిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఎప్పుడూ చెప్పలేదు. దీనికి సంబంధించి నేను విన్న సరైన హదీథ్ ఇలా ఉన్నది –  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ప్రకటించి ఉన్నారు – చనిపోయిన వారి కోసం ఏడుస్తున్న బంధువుల కారణంగా ఆ చనిపోయిన అవిశ్వాసుల శిక్షను అల్లాహ్ పెంచుతాడు.” బుఖారి మరియు ముస్లిం. ముస్లిం హదీథ్ లో ఆయేషా రదియల్లాహుఅన్హా ఇంకా ఇలా చెప్పారని నమోదు చేయబడినది – హదీథ్ ఉల్లేఖనలో వచ్చిన తేడా అబద్ధం వలన కాదు, కాని వినటం లో జరిగిన పొరపాటు వలన అయివుంటుంది.
హదీథ్ లలో కపటం మరియు అబద్ధం కనిపించడం:
మూడవ ఖలీఫా ఉత్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు హత్య తర్వాత ముస్లింలలో భేదాభిప్రాయాలు మొదలై, పోట్లాటలు ప్రారంభమైనవి. స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం మరియు తమ తమ అవసరాలను తీర్చుకోవటానికి కొంతమంది స్వార్థపరులు హదీథ్ ల పదాలను మార్చటం, అబద్ధపు హదీథ్ లను కల్పించటం ప్రారంభమైనది. ఈ పరిస్థితులలో నుండి వాస్తవమైన హదీథ్ లను కాపాడటానికి సహాబాలు (ప్రవక్త సహచరులు)కూడా గట్టిగా ప్రయత్నించటం మొదలుపెట్టారు. తమ ముందుకు వచ్చిన ప్రతి హదీథ్ యొక్క  సనన్(ఉల్లేఖకుల పరంపర) మరియు మతన్ (హదీథ్ లోని అసలు విషయం) లను క్షుణ్ణంగా పరిశీలించి, కపటమైన మరియు అబద్ధమైన హదీథ్ లను రద్దుచేసి, నిజమైన హదీథ్ లను సేకరించటం ప్రారంభించారు. ఈ అత్యంత బాధ్యతాకరమైన కార్యక్రమంలో అంటే హదీథ్ నిజానిజాలు పరీక్షించటం లో క్రింద పేర్కొనబడిన పద్ధతులను, నియమాలను  వారు అనుసరించారు.
1. హదీథ్ ను ఉల్లేఖించిన వారి గుణగణాల గురించి సహాబాలు ప్రశ్నించటం ప్రారంభమైనది. దీనికి పూర్వం ఉల్లేఖకులందరినీ నమ్మదగినవారుగా మరియు ప్రామాణికమైన వారుగా విశ్వసించేవారు.
2. సామాన్య ప్రజలు ఉల్లేఖకుల నుండి విన్న హదీథ్ లను వెంటనే స్వీకరించకుండా సావధానంగా పరిశీలించిన తర్వాతే విశ్వసించేటట్లుగా సహాబాలు ప్రోత్సహించారు. దైవభీతి, దైవభక్తి గల, సత్యవంతులుగా మరియు ప్రామాణికత గలవారుగా ప్రసిద్ధిచెందిన, నిష్ఠాపరులైన ఉల్లేఖకుల నుండి మాత్రమే హదీథ్ లను ప్రజలు స్వీకరించేటట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీని ద్వారా జర్ మరియు తాదీల్ సైన్స్ అంటే ఉల్లేఖకులను  విశ్వసించటానికి అవసరమైన పరీక్షలు జరపే సైన్స్ (విజ్ఞానశాస్త్రం) ఉనికి లోనికి వచ్చినది.
3. హదీథ్ యొక్క ప్రామాణికతను నిర్ధారించటానికి దూర దూర ప్రాంతాలకు ప్రయాణించటం – సహాబాలు ఒకరి నుండి విన్న హదీథ్ లోని నిజానిజాలు తెలుసుకోవటానికి, ఎన్ని కష్టాలెదురైనా సరే అదే హదీథ్  గురించి జ్ఞానం ఉన్న మరొకరి వద్దకు కూడా ప్రయాణించి, అందులోని ప్రామాణికతను పూర్తిగా పరీక్షించేవారు.
4. ఇంకా ఒకే హదీథ్ ను గనుక వేర్వేరు యోగ్యలైన ఉల్లేఖకర్తలు తెలిపి ఉన్నట్లైతే,  సహాబాలు వాటిని పోల్చిచూసుకునేవారు. పోలిక సరిపోతేనే ఆ హదీథ్ ను స్వీకరించేవారు. పోలిక సరిపోకపోతే తిరస్కరించేవారు.
కాబట్టి ఆ కాలంలో హదీథ్ లను రెండు రకాలుగా విభజించారు.
1. ప్రామాణికమైనవి – స్వీకరింపబడిన హదీథ్ లు
2. అప్రామాణికమైనవి – తిరస్కరింపబడిన హదీథ్ లు
) 2 హజ్రీ శతాబ్ద కాలంలో (700-800AD) హదీథ్ లను అధికారికంగా నమోదు (రికార్డు) చేయటం 
పరిపక్వత (సంపూర్ణతస్థాపితమైన కాలం
హదీథ్ సైన్స్ ఈకాలంలోనే పూర్తయినది. దీనిని క్రింది విధంగా వర్ణించవచ్చును.
1. అధికారికంగా హదీథ్ లను రికార్డు చేయటం.
అల్ బుఖారి ఇలా తెలిపారు – ముస్లింల ముఖ్య పండితుడైన అబిబకర్ ఇబ్నె హజమ్ కు అప్పటి ముస్లింల ఖలీఫా అయిన ఒమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ (100 – 102 హిజ్రీ అంటే 700 – 800 AD) ఇలా సందేశం పంపారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క నిజమైన హదీథ్ లను వెతికి ఒకచోట వ్రాయండి. ఎందుకంటే హదీథ్ వేత్తల మరణం వలన కాలక్రమంలో ఆ గొప్ప జ్ఞానసంపదను పోగొట్టుకుంటామేమో అని భయపడుతున్నాను. (అల్ బుఖారి 1:27)
కాబట్టి ముస్లిం పండితులు సరైన హదీథ్ లను సేకరించి, పుస్తకాల రూపంలో వ్రాయటం ప్రారంభించారు. వాటిలో కొన్ని క్రింద పేర్కొనబడినవి.
& మామర్ ఇబ్నె రాషిద్ హదీథ్ గ్రంథం 154 హిజ్రీ (777 AD)
& సుఫ్యాన్ అల్ థౌరి హదీథ్ గ్రంథం 161 హిజ్రీ (784 AD)
& సుఫ్యాన్ ఇబ్నె ఒయైనా హదీథ్ గ్రంథం 198 హిజ్రీ (821 AD)
& హమ్మాద్ ఇబ్నె సలామా తక్సోమి గ్రంథం 167హిజ్రీ (790 AD)
& అబ్దుల్ రజ్జాఖ్ తక్సోమి గ్రంథం 211హిజ్రీ (834 AD)
& అల్ మువత్తా(ఇమాం మలిక్)- పైవాటన్నింటిలోకి ఎక్కువ యోగ్యమైనది.
2. హదీథ్ సరైనదా కాదా అనే పరిశోధనలలో అభివృద్ది (జర్ తాదీల్ సైన్స్మరియు ఉల్లేఖకుల గుణగణాలనుప్రశ్నించటం
ఈ విషయంలో దిగువ పేర్కొన్న కొందరు పండితులు చాలా ప్రసిద్ధిచెందారు.
*  షౌబా ఇబ్నె అల్ హజ్జాజ్ – 160 హిజ్రీ (783 AD)
*  సుఫ్యాన్ అల్ థౌరి – 161 హిజ్రీ (784 AD)
*  అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె మహ్ది 198 హిజ్రీ (821 AD)
3. యోగ్యులుగా ప్రసిద్ధిచెందని వారి హదీథ్ ఉల్లేఖనలను తిరస్కరించటం
 4. హదీథ్ ఉల్లేఖనలను నిర్ధారించటానికి షరతులు కనిపెట్టడం   
ఈ షరతులను తయారు చేసిన మొదటి పండితుడు ఇమామ్ అల్ జొహ్రి. వీటిని పుస్తకరూపంలో వ్రాయకుండానే బోధించేవారు,
5.  అల్ రిసాలా ప్రతి – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క హదీథ్ లను స్వీకరించటానికి ఇమామ్ షాఫయి కొన్ని హదీథ్ షరతులను వ్రాసినారు. 
) 3 హజ్రీ శతాబ్దం (800-900ADనుండి 4 హిజ్రీ శతాబ్దపు మధ్య కాలం హదీథ్ లకు స్వర్ణయుగం
ఈ కాలం సరైన హదీథ్ లను ఒకచోట సేకరించటానికి మరియు హదీథ్ విజ్ఞాన గ్రంథాలు తయారుకావటానికి సాక్ష్యంగా నిలచినది. హదీథ్ విజ్ఞానశాస్త్రం అనేక విభాగాలుగా అభివద్ధి చెందినది.  పురుష ఉల్లేఖకుల హదీథ్ లే ఉన్నటువంటి (అతి తక్కువ సంఖ్యలో మహిళా ఉల్లేఖకుల హదీథ్ ఉన్నటువంటి) పురుష హదీథ్ విజ్ఞానశాస్త్రం సమకూర్చారు. అందులో ఉల్లేఖకుల స్థితిగతులు, వారి రాజకీయ పూర్వరంగం, వ్యక్తిగత జీవితవిధానం మొదలైన అనేక విషయాలు చేర్చటం జరిగినది. ఎలాల్ అల్ తిర్మిథి అనే గ్రంథంలో ఇమామ్ తిర్మిథి హదీథ్ లకు సంబంధించిన వివిధ సమస్యలను వివరంగా చర్చించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక హదీథ్ గ్రంథాలు ఈ కాలంలోనే వ్రాయబడినాయి. అవి ఈనాటికీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలో
ü కొన్ని కేవలం విశ్వసనీయమైన(సహీహ్) హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథాలున్నాయి,
ü ఇంకొన్ని విశ్వసనీయమైన మరియు స్వీకరించగలిగే అర్హతలు గల హదీథ్ లున్న గ్రంథాలున్నాయి,
ü మరికొన్ని విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లున్న గ్రంథాలు కూడా ఉన్నాయి, వీటికి ఉదాహరణ –
& సహీహ్ బుఖారీ (విశ్వసనీయమైనది హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథం-Only Authentic hadith)
& సహీహ్ ముస్లిం (విశ్వసనీయమైన హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథం-Only Authentic hadith)
& సునన్ దావూద్ (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)
& సునన్ అల్ తిర్మిథి (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)
& సునన్ అన్ నిసాయి (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)
& సునన్ ఇబ్నె మాజా (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)
ఇంకా అనేక హదీథ్ గ్రంథాలు మరియు హదీథ్ విజ్ఞానశాస్త్ర గ్రంథాలు ఈ కాలంలోనూ, తర్వాత కాలాల్లోనూ వ్రాయబడినాయి. కాని కేవలం ఈ కాలంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలు మాత్రమే విశ్వసనీయమైనవిగా (authentic) ప్రత్యేక గుర్తింపు పొందాయి.
) 4 హిజ్రీ శతాబ్దం మధ్య కాలం నుండి నేటి వరకు –  సంపూర్ణంగా హదీథ్ విద్య అభివృద్ధి చెందిన కాలం 
ఈకాలంలో హదీథ్ విద్య మరియు హదీథ్ సైన్స్ (విజ్ఞానశాస్త్ర) గ్రంథాలు పూర్తిగా ప్రపంచం మొత్తం వ్యాపించాయి. ఇస్లాం లో వాటి విషయ ప్రాముఖ్యతను బట్టి వివిధ అధ్యాయాలుగా (అంటే ఖుర్ఆన్ అవతరణ, విశ్వాసం, నమాజులు, దానం, ఉపవాసం, హజ్, లావాదేవీలు, ఇతర వ్యవహారాలు, శిక్షలు, జుర్మానాలు,మొదలైనవి) సమకూర్చ బడినాయి. ఇంకా వీటి సారాంశాన్ని మరియు వివరణను ఇతర పండితులు వేర్వేరు గ్రంథాలుగా తయారుచేశారు. ఉదాహరణకు –
& ఫతహ్ అల్ బారి ( సహీహ్ బుఖారి వివరణ) – ఇమామ్ ఇబ్నె హజర్ 852హిజ్రీ (1475 AD)
& అల్ మిన్ హజ్ (సహీహ్ ముస్లిం వివరణ) – ఇమామ్ అన్ నవావీ 676హిజ్రీ (1299 AD)
& హదీథ్ విజ్ఞానశాస్త్రాల పరిచయం- ఇమామ్ ఇబ్నె అల్ సలాహ్ 643హిజ్రీ (1266 AD)
& హదీథ్ విజ్ఞాన శాస్త్రాలు(వివరణ) – ఇమామ్ అల్ సియూతి
911 హిజ్రీ (1534 AD)
హదీథ్ రకాలు
విశ్వసనీయతను బట్టి మూడు రకాలైన హదీథ్ లు ఉన్నాయి.
1. సహీహ్ హదీథ్ లు (పూర్తిగా విశ్వసించదగినవి – Authentic)
హదీథ్ ను రికార్డు చేసిన మొదటి ఉల్లేఖకుడి (అల్ బుఖారి లేక ముస్లిం) నుండి చిట్టచివరి ఉల్లేఖకుడి వరకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వరకు ఒకరి నుండి మరొకరి మధ్య, ఉల్లేఖకుల వరుసక్రమంలో ఎటువంటి అంతరాయం (బ్రేక్) లేకుండా ఉన్న హదీథ్ లు. ఇంకా ఈ హదీథ్ లన్నీ పూర్తిగా నమ్మదగిన మరియు యోగ్యులైన ఉల్లేఖకులు తెలిపినవే.
2. హసన్ హదీథ్ లు (స్వీకారయోగ్యమైన హదీథ్ లు – Acceptable)
హదీథ్ ను రికార్డు చేసిన మొదటి ఉల్లేఖకుడి (అల్ తిర్మథి) నుండి చిట్టచివరి ఉల్లేఖకుడి వరకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వరకు ఒకరి నుండి మరొకరి మధ్య, ఉల్లేఖకుల వరుసక్రమంలో ఎటువంటి అంతరాయం (బ్రేక్) లేకుండా ఉన్న హదీథ్ లు. వీటిని ఉల్లేఖించిన వారు కూడా పూర్తిగా నమ్మకమైనవారే కాని తక్కువ యోగ్యులు.
  1. బలహీనమైన హదీథ్ లు(స్వీకరింపలేనివి లేక  తిరస్కరింపబడినవి)
సమస్యలున్న మరియు ఉల్లేఖకుల వరుసక్రమంలో అంతరాయం (మధ్యలో ఒకరు లేక ఒకరి కన్నా ఎక్కువ ఉల్లేఖకుల పేర్లు తప్పిపోవటం) ఉన్న హదీథ్ లు. ఒకరు లేక ఒకరి కన్నా ఎక్కువ ఉల్లేఖకులు నమ్మకమైనవారు కాకపోవటం అంటే వయస్సు భారం వలన ఆలోచనాశక్తి తగ్గినవారు, రికార్డు చేసిన వ్రాతప్రతులు పోగొట్టుకున్నవారు, అసత్యవంతులుగా ప్రసిద్ధి చెందిన వారు, అపరిచిత ఉల్లేఖకులు.
ప్రశ్నలు
01.ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) కాలంలోనే హదీథ్ లను రికార్డు (నమోదు) చేయటం మొదలైనదా?
02. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హదీథ్ లను వ్రాయటానికి అనుమతిచ్చారా లేక నిషేధించారా అనే విషయాన్ని నిర్ణయించడానికి వీలుగా ముస్లిం పండితులు ప్రకటించిన కారణాలేవి?
03.ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం జీవితకాలంలోనే వ్రాయబడిన హదీథ్ ప్రతుల వివరాలు తెలుపండి.
04.మొదటి హిజ్రీ శతాబ్దంలో హదీథ్ ల నిజానిజాలు పరీక్షించటానిక ఏ పద్ధతులను అనుసరించారు?
05.మొదటి హిజ్రీ శతాబ్దంలో హదీథ్ లను ఎన్ని రకాలు గా విభజించారు?
06.రెండవ హిజ్రీ శతాబ్దంలో హదీథ్ ల ప్రాముఖ్యత ఏమిటి?
07.రెండవ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలను పేర్కొనండి?
08.హదీథ్ సరైనదా కాదా అనే పరిశోధనలలో ప్రసిద్ధిచెందిన వారి పేర్లు?
09.హదీథ్ ఉల్లేఖనలను నిర్ధారించటానికి షరతులు కనిపెట్టిన మొదటి హదీథ్ వేత్త ఎవరు?
10.హదీథ్ లను స్వీకరించటానికి ఇమామ్ షాఫయి వ్రాసిన ప్రతి పేరు?
11.హదీథ్ లకు స్వర్ణయుగమని ప్రసిద్ధి చెందిన కాలమేది?
12.3వ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన ప్రఖ్యాత 6 హదీథ్ గ్రంథాలేవి? అవి ఎటువంటి హదీథ్ లు కలిగి ఉన్న గ్రంథాలు?
13.ఏ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలు విశ్వసనీయమైనవిగా (authentic) ప్రత్యేక గుర్తింపు పొందాయి?
14.హిజ్రీ 4వ శతాబ్దం తరువాత వచ్చిన ప్రఖ్యాత హదీథ్ గ్రంథాలేవి?
15.బుఖారీ & ముస్లిం హదీథ్ గ్రంథాలకు మరియు ఇతర హదీథ్ గ్రంథాలకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి?
16.ఎన్నిరకాలైన హదీథ్ లున్నాయి? వివరంగా తెలుపండి.
17. రదియల్లాహు అన్ హు అంటే అర్థం ఏమిటి?ఎవరి పేరు వచ్చిన ఎడల దీనిని పలుక వలెను? మూడు ఉదాహరణలు ఇవ్వవలెను.